మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపల్ పట్టణంలోని బతుకమ్మ చీరల పంపిణీ ఈరోజు నుండి వార్డుల వారీగా బతుకమ్మ చీరలు మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ అధ్యక్షతన మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి యాదగిరి. కమిషనర్ శ్రీమతి డి ఉమాదేవి. మున్సిపల్ పాలకవర్గం ఈరోజు చీరల పంపిణీ మొదలుపెట్టారు. రామాయంపేట మున్సిపల్ పట్టణంలోని 12 వార్డులకు గాను 18 సంవత్సరాల నుండి రేషన్ కార్డులో పేరు కలిగి ఉన్న వారికి సుమారు 5000 చీరలు మున్సిపల్ కార్యానికి వచ్చినయాని తెలిపారు.సంబంధిత వార్డు సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వార్డులలో రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు తీసుకుని లబ్ధిదారులు సెంటర్ ల వద్దకు వెళ్లినచో బతుకమ్మ చీర ఇవ్వబడుతుందని మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ తెలిపారు.వార్డుల వారిగా పంపిణీ అధికారులు పంపిణీ చేస్తారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఉమాదేవి, మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీమతి పుట్టి విజయలక్ష్మి యాదగిరి. మరియు వార్డు కౌన్సిలర్సు వార్డు అధికారులు మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్ మహిళా రిసోర్స్ పర్సన్స్ పాల్గొన్నారు.