కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల తహశీల్దార్ కార్యాలయంలో కాలయాపన కొనసాగుతోంది నెలల పొంటి అమాయక జనులు కార్యాలయంలో పనిచేస్తున్న ఆపరేటర్ల చుట్టుపక్కల తిరిగిన కావల్సిన పనులు కావడం లేదని చెబుతున్నారు. రేపురా మాపు రా సంతకాలు ఉన్నాయంటున్నారన్నారు తాజాగా బుధవారం సరండి గ్రామానికి చెందిన ఎమ్.సునీల్ అనే బాధితుడు నెల క్రితం తను మీసేవలో రెసిడెన్స్ సర్టిఫికెట్ అప్లై చేశానని కార్యాలయంలో పనిచేస్తున్న సాయి అనే వ్యక్తి వద్దకు నెల రోజులపొంటి ఏమైందని అడిగిన రేపుమాపు అంటూ బుధవారం సంతకాలు అంటూ మరో కొత్తకోణం మొదలెట్టారని మీడియాకు వచ్చనన్నారు.ఇప్పటికైనా తనకు కావాల్సిన సర్టిఫికెట్ ఇస్తే చెయ్యాల్సిన పనులు చేసుకుంటానని వ్యపోయారు.తెలిసిన వారు కూసింత రాజకీయ తదితర అధికారులకు పనులు అవుతాయని కానీ సామాన్యులకు మాత్రం వాంకిడి తహశీల్దార్ కార్యాలయంలో కాలయాపననే ఎదురవుతోందని ఆవేదన వ్యక్తంచేశారు.