గిప్ట్ డీడ్ తీసుకొని టిడిఆర్ సిద్దం చేయండి – కమిషనర్ హరిత ఐఏఎస్

గిప్ట్ డీడ్ తీసుకొని టిడిఆర్ సిద్దం చేయండి – కమిషనర్ హరిత ఐఏఎస్

తిరుపతి నగరం

మాస్టర్ ప్లాన్ రోడ్ల కొరకు స్థలాలు ఇచ్చిన యజమానుల నుండి గిఫ్ట్ డీడ్ లను తీసుకుని ట్రాన్సఫరబల్ డెవలప్మెంట్ రైట్స్ (టి.డి.ఆర్) బాండ్లను సిద్ధం చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ ప్లానింగ్ అధికారులనుద్దెశించి అన్నారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ప్లానింగ్ అధికారులతో మంగళవారం కమీషనర్ హరిత ఐఏఎస్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తిరుపతి నగరంలో రహదారుల విస్తరణకు నూతన మాస్టర్ ప్లాన్ రోడ్లను తీసుకురావడం, అదేవిధంగా అంతర్గత రోడ్లను వెడల్పు చేయడం జరుగుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ రహదారుల నిర్మాణాల పూర్తికి అధికారులు కృషి చేయాలన్నారు. ముఖ్యంగా రహదారుల నిర్మాణానికి స్థలాలు ఇచ్చినటువంటి యజమానులు, రైతులు వద్ద నుండి గిఫ్ట్ డీడ్ కింద వారి స్థలాలని రిజిస్ట్రేషన్ చేయించాలని, అనంతరం వారికి టిడిఆర్ బాండ్లు ఇచ్చేందుకు అంతా సిద్ధం చేసి వెంటనే ఆ ప్రక్రియలో భాగంగా టిడిఆర్ బాండ్లను వారికి అందజేశేలా చూడాలన్నారు. అంతేకాకుండా నగరంలో ఇకపై ఎక్కడ గాని ఆక్రమణలు జరగకుండా నిరంతరం పర్యవేక్షించేలా ఉండాలని, ఇప్పటికే రహదారులను ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా ప్లానింగ్ అధికారులు, లీగల్ సెల్ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. నగరంలో వస్తున్నటువంటి రహదారుల ఆవశ్యకతను ప్రజలందరికీ వివరించాలని, ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకొని మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణల పూర్తికి కృషి చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ సిటి ప్లానర్ శ్రీనివాసులు రెడ్డి, అసిస్టెంట్ సిటి ప్లానర్ బాలసుబ్రమణ్యం, సర్వేయర్ దేవానంద్, ప్లానింగ్ అధికారులు, లీగల్ సెల్ అధికారులు పాల్గొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!