గోవిందరావుపేట మండల కేంద్రంలో మహిళా కాంగ్రెస్ పార్టీ నాయకురాల్ల ప్రచారం…

కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన ఆరు గ్యారెంటీ అమలు గురించి ప్రజల్లో ప్రచారం…

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో అమలు చేస్తామని హామీ…

ఇంటింటికి, గడప, గడపకు ప్రచారం

రాబోవు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కాంగ్రెస్ పార్టీదే అంటున్న మండల మహిళా అధ్యక్షురాలు మద్దాలి నాగమణి

తేదీ: 04.10.2023 మంగళవారం రోజు సాయంత్రం గోవిందరావుపేట మండల కేంద్రంలోని తారక రామ కాలనీలోని జిల్లా కార్యదర్శి సూదిరెడ్డి జయమ్మ గారి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించగా అట్టి ప్రచార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా  మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మద్దాలి నాగమణి గారు విచ్చేసి ఇంటింటికి తిరుగుతూ ప్రతి ఒక్కరికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీ పథకాలు రైతు భరోసా, యువ వికాసం, గృహలక్ష్మి, గృహజ్యోతి, రాజీవ్ ఆరోగ్య శ్రీ మరియు చేయూత లాంటి పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందిస్తామని, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని ప్రజలను కోరుతూ ప్రచారం నిర్వహించారు.

 ఈ సందర్భముగా నాగమణి గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇటీవల హైదరాబాద్ యందు తుక్కుగూడలో జరిగిన విజయభేరి సభలో ఆరు గ్యారెంటీ పథకాలను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తాం అని తెలంగాణ తల్లి సోనియమ్మ హామీ ఇచ్చారు అని, వాటిని గడప, గడపకు తిరుగుతూ ఆరు గ్యారెంటీ పథకాలను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే అమలు చేస్తాం అని, అర్హులైన ప్రతి ఒక్కరికీ 
  1. రైతు భరోసా ద్వారా ఉచిత విద్యుత్, 2 లక్షల రైతు రుణమాఫి, ప్రతి ఏటా పట్టాదారులకు 15000/- రూపాయలు, కౌలు రైతులకు 12000/- రూపాయలు, జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అను సంధానం చేసి వ్యవసాయాన్ని పండుగ చేస్తాం అని అన్నారు.
  2. గృహ జ్యోతి పథకం ద్వారా మహిళలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని అన్నారు.
  3. గృహలక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళకు నెలకు 2500/- రూపాయలు అందిస్తామని అన్నారు.
  4. చేయూత పథకం ద్వారా వృద్దులకు, ఒంటరి మహిళలకు, వితంతువులకు, వికలాంగులకు మరియు బీడీ కార్మికులకు ఇంట్లో ఎంత మంది ఉంటే అందరికీ 4000/- రూపాయల పెన్షన్ అందిస్తామని అన్నారు.
  5. యువ వికాసం ద్వారా విద్యార్థులకు ఫీజ్ రీ ఇంబర్శుమెంట్ అందించి పేద విద్యార్థులందరికీ ఉచిత ఉన్నత విద్యను అందించి 5 లక్షల రూపాయల వరకు విద్యార్థులకు అందిస్తామని అన్నారు.
  6. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి ఏటా 10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని అన్నారు.
    ఈ ఆరు గ్యారంటీ పథకాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే అమలు చేస్తామని హామీలు ఇచ్చి ప్రతి ఇంటికి ప్రచారాన్ని నిర్వహించారు. అలాగే అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్ల ద్వారా నిర్మాణానికి 5 లక్షల రూపాయలు, ఎస్సి, ఎస్టీ లకు 6 లక్షల రూపాయలు కల్పిస్తాం అని, ఇండ్ల స్థలాలు లేని వారికి ఉచితంగా 250 గజాల ఇళ్ళ స్థలాన్ని కేటాయించి ఇల్లు నిర్మిస్తామని అన్నారు. ఇప్పటికీ బి.ఆర్.ఎస్.పార్టీ పేదల కోసం సంక్షేమ పథకాలు ఇచ్చారా లేక పార్టీ కోసం ఇచ్చారో అర్థం కాకుండా ఉన్నదని, పార్టీ కార్యకర్తలకు పథకాలు పంచడం దారుణం అని అన్నారు. నియంత పాలనను అంతమొందించి పేదల పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గోపిదాసు వజ్రమ్మ, కట్ల ప్రమీల, కొత్తూరు మణి, గోల్కొండ విజయ, సింగపురం శాంత, మిరియాల లక్ష్మి, మాచర్ల దేవమ్మ, వక్కల శివ తదితర నాయకులు హాజరయ్యారు.
Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!