బడుగువానిలంకలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం
గడప గడపకు సంక్షేమమే ధ్యేయం
గత ప్రభుత్వం పార్టీ చూసి, కులం చూసి, మతం చూసి అరకొరగా అందించిన సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన నాటి నుండి పార్టీ, కులం, మతం, ప్రాంతం, వర్గం ఇవేమీ చూడకుండా అర్హతే ప్రామాణికంగా అందరికీ అందించామని ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి అన్నారు.
ఆలమూరు మండలం బడుగువానిలంక గ్రామంలో ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతీ గడపకు వెళ్ళి జగనన్న ప్రభుత్వంలో అందించిన సంక్షేమ పథకాల వివరాలను ప్రజలకు వివరించారు.
ఈ సందర్భంగా చిర్ల మాట్లాడుతూ వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గడిచిన నాలుగున్నరేళ్ల కాలంలో
బీసీ వర్గాల లబ్ధిదారులకు 1 కోటీ 5 లక్షల 17 వేల 704 రూపాయలు,
ఎస్సి లబ్ధిదారులకు 2 కోట్ల 99 లక్షల 47 వేల 110 రూపాయలు,
ఎస్టీ లబ్ధిదారులకు 3 లక్షల 57 వేల 510 రూపాయలు,
కాపు సామాజిక వర్గ లబ్ధిదారులకు 8 కోట్ల 36 లక్షల 67 వేల 365 రూపాయలు,
ఇతర సామాజిక వర్గాల లబ్ధిదారులకు 46 లక్షల 62 వేల 69 రూపాయలు,
కలిపి మొత్తం గ్రామంలో వివిధ సంక్షేమ పథకాల రూపంలో 12 కోట్ల 91 లక్షల 51 వేల 758 రూపాయలు లబ్ది చేకూర్చామని తెలియచేశారు.