ఎరువులు, పురుగుమందుల దుకాణాలు తనఖీ
అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు
-మండల వ్యవసాయ శాఖ అధికారి బి.నాగేశ్వర్ రెడ్డి
స్టూడియో 10 టీవీ న్యూస్, అక్టోబర్ 03, మహానంది:
మహానంది మండలం గాజులపల్లె గ్రామంలోని ఎరువులు,పురుగు మందుల దుకాణాలను మండల వ్యవసాయ శాఖ అధికారి బి నాగేశ్వర్ రెడ్డి మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుకాణదారులు అనుమతులు ఉన్న ఎరువులు మరియు పురుగుమందులు మాత్రమే అమ్మాలని , అదేవిధంగా బస్తా పైన ఉన్న ఎం ఆర్ పి రేటు ప్రకారమే రైతులకు ఎరువులు అందించాలని హెచ్చరించారు.
అధిక ధరలకు ఎరువులను అమ్మితే ఎరువుల నియంత్రణ చట్టం ప్రకారము కఠిన చర్యలు తీసుకుంటామని, వారి లైసెన్సులు సస్పెండ్ చేయడం జరుగుతుందని, ఈ పాస్ మిషన్ ద్వారానే రైతులకు ఎరువులను అందించాలని, అదేవిధంగా దుకాణదారులు కచ్చితంగా రైతులకు బిల్లులు ఇవ్వాలని , ధరల పట్టిక లో ప్రతిరోజు ఎరువులు మరియు పురుగు మందుల ధరల వివరాలను తెలియజేయాలని, ఎరువుల కృత్రిమ కొరత సృష్టించి గరిష్ట చిల్లర ధర కంటే అధికముగా అమ్మితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అనంతరం గాజులపల్లె రైతు భరోసా కేంద్రం ను తనిఖీ చేసి పంట నమోదు చేయించుకున్న రైతులు తప్పనిసరిగా రైతు భరోసా కేంద్రానికి వచ్చి ఈ కేవైసీ చేయించుకోవాలని, ఈకేవైసీ చేయించుకోవడానికి కేవలము రెండు రోజుల సమయం మాత్రమే ఉన్నందున రైతులు ఆలస్యం చేయకుండా రైతు భరోసా కేంద్రంలో బయోమెట్రిక్ ద్వారా వెంటనే ఈ కేవైసీ చేయించుకోవాలని రైతులకు తెలియజేశారు.పంట నమోదు చేయించుకున్న రైతులు రైతు ఈ కేవైసీ చేయించుకోకపోతే , వారికి వ్యవసాయ శాఖ ద్వారా వచ్చేటువంటి పంట నష్టపరిహారము పంట బీమా మరియు సున్నా వడ్డీ పథకము లాంటి వివిధ పథకాలు వర్తించమని రైతులకు తెలియజేశారు.