ప్రతీ ఇంట ఆరోగ్యం జగనన్న ఆరోగ్య సురక్షతోనే సాధ్యం

ప్రతీ ఇంట ఆరోగ్యం జగనన్న ఆరోగ్య సురక్షతోనే సాధ్యం

స్టూడియో 10 టీవీ న్యూస్,అక్టోబర్ 03, మహానంది:

ప్రతీ ఇంట ఆరోగ్యం జగనన్న ఆరోగ్య సురక్షతోనే సాధ్యం అని మండల అధ్యక్షురాలు బుడ్డారెడ్డి యశస్విని అన్నారు.మంగళవారం మహానంది మండలం గాజులపల్లె గ్రామంలోని సచివాలయం 2 వద్ద జ‌గ‌న‌న్న ఆరోగ్య సుర‌క్ష కార్య‌క్ర‌మాన్ని ముఖ్య అతిథిగా హాజరైన ఆమె ప్రారంభించారు. ఎంపీడీవో శివ నాగజ్యోతి ఆధ్వర్యంలో డాక్టర్ వెంకటరెడ్డి జ‌గ‌నన్న ఆరోగ్య సుర‌క్ష కార్యక్ర‌మం ద్వారా ప్రజలకు వైద్య‌ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించి, మందుల‌ను ఉచితంగా అందజేసారు.తాహసిల్దార్ జనార్దన్ శెట్టి మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష నిజంగా చాలా అద్భుతమైన కార్యక్రమమని, దేశంలో ఎవరికీ రాని గొప్ప ఆలోచన జగనన్న ఆరోగ్య సురక్ష అన్నారు. ఎంపీడీవో శివ నాగజ్యోతి మాట్లాడుతూ జగనన్న సురక్షతో ప్రతి పేదవాడికి ఉచిత వైద్యం అందుతుందని,జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం గాజులపల్లె గ్రామంలోని జగనన్న ఇలా నిర్మాణాలను తాహాసిల్దార్ జనార్దన్ శెట్టి, ఎంపీడీవో శివ నాగజ్యోతి, జడ్పిటిసి కెవిఆర్ మహేష్ రెడ్డి లతో కలిసి మండల అధ్యక్షులు బుడ్డారెడ్డి పిల్ల నిర్మాణాలను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కెవిఆర్ మహేశ్వర్,డిడి సోషల్ వెల్ఫేర్ చింతామణి, రెడ్డి, డాక్టర్ వెంకటరెడ్డి, ఎంపీహెచ్ ఈవో హుసేన్ రెడ్డి, సర్పంచ్ చంటి, వైసిపి నాయకులు కొండా మధుసూదన్ రెడ్డి, వీఆర్వోలు వెంకటరాముడు, చంద్రమోహన్, పంచాయతీ కార్యదర్శులు, మహమ్మద్ ఇర్ఫాన్, శ్రీనివాసులు, సచివాలయ సిబ్బంది, వైద్య సిబ్బంది,వాలంటీర్లు, ఆశా కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!