మహానంది పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఎస్పీ రఘువీర్ రెడ్డి
స్టూడియో 10 టీవీ న్యూస్, అక్టోబర్ 03, మహానంది:
మహానంది పోలీస్ స్టేషన్ ను వార్షిక తనిఖీల్లో భాగంగా నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి మంగళవారం ఆకస్మితంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సైబర్ నేరాల తో యువత అప్రమత్తంగా ఉండాలని, అంతేకాకుండా ఇటీవల కాలంలో చదువుకున్నవారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సైబర్ నేరాల బారిన పడుతున్నారని, యువత అత్యాశకు పోకుండా ఈ సైబర్ నేరాల నుండి జాగ్రత్త పడాలని అన్నారు. మహానంది పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులకు అసౌకర్యం కలిగించకుండా ప్రశాంతమైన వాతావరణ కల్పించే విధంగా పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. మహానంది పుణ్యక్షేత్రానికి దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తుల నుండి స్థానికంగా నడుపుతున్న ప్రైవేట్ లాడ్జిల్లా వారు అధిక బాడుగలు తీసుకొనకుండా టారిఫ్ బోర్డ్ ఏర్పాటు చేసి భక్తుల ప్రూఫ్స్ మరియు మొబైల్ నెంబర్లు తప్పనిసరిగా సరిగా రిజిస్టర్ మెయింటైన్ చేస్తూ ఎప్పటికప్పుడు పోలీసు వారికి అందజేయాలి అని అన్నారు. క్షేత్ర పరిసరాల్లో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. క్షేత్ర పరిసరాల్లో హోటల్ యజమానులు కూడా ఫుడ్ సేఫ్టీ నుంచి లైసెన్స్ పొంది భక్తులకు క్వాలిటీ ఫుడ్ అందజేస్తూ భక్తులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గత వారం రోజుల క్రితం మహానంది బోయలకుంట్ల రహదారిలో దొంగతనాలకు పాల్పడిన దొంగలను నాలుగు రోజుల్లో పట్టుకుంటామని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మహానంది క్షేత్ర పరిధిలో గుట్కా సిగరెట్టు మద్యపానం అమ్మకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. మహానంది బోయలకుంట్ల మార్గంలో దొంగతనాలు జరగకుండా రాత్రి సమయాల్లో గస్తీని ఏర్పాటు చేయాలని, కూడలి ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అన్నారు. మండలంలో ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు.