మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో బాలాజీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ సమావేశంలో మూడు రోజుల క్రితం జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన కంఠారెడ్డి తిరుపతి రెడ్డికి మద్దతుగా నిన్న సేవదల్ జిల్లా అధ్యక్షులు వెంకట్ రెడ్డి రాజీనామా చేయగా, నేడు ఉమ్మడి రామాయంపేట మండలాల అధ్యక్షులు శ్యామ్ రెడ్డి, లింగం గౌడ్ వారితో పాటు పార్టీలో వివిధ హోదాల్లో ఉన్నవారు పార్టీకి రాజీనామా చేశారు. ఈ సంద్భంగా వారు మాట్లాడుతూ గత పదేండ్లు కాంగ్రెస్ పార్టీకి అన్నితనై ముందుండి నడిపిన తిరుపతి రెడ్డి కి అధిష్టానం తీరని మోసం చేసిందని వారు వాపోయారు. ప్రతిసారి ఎన్నికలు రాగానే పరాషూట్ లకు టికెట్లు ఇస్తు కష్టపడ్డవరికి అన్యాయానికి గురిచేస్తుంది. మెదక్ నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ గడ్డుకాలం ఉన్న సమయంలో పార్టీని తన బుజస్కందలపై వేసుకొని గ్రామ గ్రామాన పార్టీని బలోపేతం చేశారు. 2018 ఎన్నికల్లో పార్టీ ఓటమిపాలైన తరువాత కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకోవడానికి భయపడుతున్న సమయంలో మీ అందరికీ నేను అండగా ఉంటానని తిరుపతి రెడ్డి ముందుకు నడిపించారు, నేడు మళ్ళీ ఎన్నికలు రాగానే కష్టపడ్డ వారికి అన్యాయం చేస్తూ ఇతర పార్టీల నుండి వచ్చేసరికి అవకాశం కల్పించడన్ని జీర్ణించుకోలేకపోతున్నాము. ఇక మీదట తిరుపతి రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్న మ ప్రయాణం ఆయనతోనేనని వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీసీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు కేశవులు, రామాయంపేట మండల ST సెల్ మండల అధ్యక్షులు తౌర్య, కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, పర్వతపుర్ గ్రామ అధ్యక్షులు సురేందర్, కాట్రియల గ్రామ అధ్యక్షులు మహేందర్ రెడ్డి, మైనారిటీ సెల్ అధ్యక్షులు అలీ,లక్ష్మపుర్ గ్రామ అధ్యక్షులు యాదగిరి, దంతేపల్లీ అధ్యక్షులు ప్రవీణ్, నిజాంపేట మండల ప్రధాన కార్యదర్శి మధుసూధన్ రెడ్డి, బీసీ సెల్ మండల అధ్యక్షులు నారాగౌడ్, నాగరాజు,ST సెల్ జిల్లా కార్యదర్శి విఠల్ తదితరులు పాల్గొన్నారు.