మెదక్ జిల్లా రామాయంపేటలో మంత్రి హరీష్ రావు పర్యటించారు. రామాయంపేట మున్సిపాలిటీలో 45 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. రామాయంపేటలో రెవెన్యూ డివిజన్ కార్యాలయము డిగ్రీ కళాశాల మున్సిపల్ కార్యాలయ ప్రారంభోత్సవ శంకుస్థాపనతో పాటు 45 కోట్లతో వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాలు మరియు గృహలక్ష్మి పథకం లబ్ధిదారులకు మంజూరు మంజూరు పత్రాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావుతోపాటు ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డిలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో ముందడుగు వేస్తుందని రైతును రాజుగా చేసిన పార్టీ బిఆర్ఎస్ పార్టీ అని మంత్రి హరీష్ అన్నారు.మెదక్ నియోజకవర్గంలో కొంతమంది నాయకులు కరోనా కష్టకాలంలో ప్రజల వద్దకు రాలేదని కానీ ప్రస్తుతం డబ్బు సంచులు పట్టుకొని పోటీకి వస్తున్నారని, వారిని నమ్మవద్దని మంత్రి హరీష్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి మాట మార్చడంలో దిట్ట అని, గతంలో టిడిపి పార్టీలో ఉండి కాంగ్రెస్ పాలనపై విమర్శించారని కానీ ప్రస్తుతం 10 ఏళ్ల కాంగ్రెస్ పాలన 10 ఏళ్ల టిఆర్ఎస్ పనులపై చర్చిద్దాం అనడం విడ్డూరంగా ఉందని అన్నారు. రామాయంపేటకు రెవెన్యూ డివిజన్ ఇచ్చి డిగ్రీ కళాశాల ఏర్పాటుచేసి అభివృద్ధి కోసం 45 కోట్లు మంజూరు చేసిన ఘనత టిఆర్ఎస్ పార్టీదని అన్నారు. ప్రజలు ధన బలం వైపు కాకుండా అభివృద్ధి వైపు నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రామయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాపు యాదగిరి, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి, తాసిల్దార్ రజిని, ఎంపీడీవో ఉమాదేవి, మున్సిపల్ కౌన్సిలర్లు వివిధ గ్రామాలకు చెందిన సర్పంచులు ఎంపిటిసిలు వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.