*శ్రమదానం చేపట్టిన 31వ వార్డు కౌన్సిలర్ మాలె గాయత్రి లక్ష్మణ్*
గాంధీ జయంతిని పురస్కరించుకొని 31వ వార్డులో పలు పరిసరాల్లో కౌన్సిలర్ మాలె గాయత్రి లక్ష్మణ్ స్వయంగా తానే శ్రమదానం చేయడం జరిగింది..
ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ అందరూ కూడా ప్రతిరోజు ఒక గంట సమయం ఇలాంటి శ్రమదాన కార్యక్రమం చేపట్టి మన పరిసరాలను పరిశుభ్రం చేసుకోవడం వలన సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండవచ్చని, అదేవిధంగా అందరూ కూడా స్వచ్ఛభారత్ లో భాగస్వామ్యమైన వారవుతారని అన్నారు.
ఈ కార్యక్రమం లో వార్డు స్పెషల్ ఆఫీసర్ ఈశ్వరి, RP విజయ, వార్డు మహిళలు, మహిళా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు…