రానున్న రోజుల్లో ప్రజల మద్దతుతో అధికారంలోకి రాబోయేది టిడిపి ప్రభుత్వమే..

రానున్న రోజుల్లో ప్రజల మద్దతుతో అధికారంలోకి రాబోయేది టిడిపి ప్రభుత్వమే..

– మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి..

స్టూడియో 10 టీవీ న్యూస్ సెప్టెంబర్ 16, మహానంది:

వచ్చే ఎన్నికల్లో ప్రజల మద్దతుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం రాబోతుందని, జగన్‌ విధ్వంస పాలనకు వ్యతిరేకంగా ప్రజలంతా ఐక్యంగా పోరాడాలి అని శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అన్నారు.
చంద్రబాబుకు అండగా బాబుతో మేము సైతం
కార్యక్రమంలో భాగంగా శనివారం మహానందిలోని ఈశ్వర్ నగర్ లో మండల టిడిపి నాయకులు రిలే నిరాహారదీక్షలు చేపట్టారు.ముందుగా మండలంలో టిడిపి నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించి, మహానందీశ్వర స్వామివారి దేవస్థానం ముందు 101 టెంకాయలు సమర్పించారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న చంద్రబాబుపై జగన్‌రెడ్డి అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారన్నారు.రాష్ట్రంలో సైకోపాలన సాగుతోందని, వైసీపీ ప్రభుత్వంపై, ప్రజా సమస్యలపై గళమెత్తి మాట్లాడితే వారిపై అక్రమ కేసులు పెట్టి వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. నవరత్నాలు ప్రవేశపెట్టిన ప్రభుత్వం అమలు చేయడంలో మాత్రం అలసత్వం వహిస్తుందని ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. మధ్యనిషేధమని ఎన్నికల హామీలు చెప్పి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజలను మందుకు బానిసలు చేశారని అన్నారు. ప్రజా క్షేత్రంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ అన్ని ప్రతిపక్ష పార్టీ లు కలిసి కట్టుగా పోరాడితే వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పారావచ్చు అని అన్నారు.అధికారం ఉందని అన్యాయంగా ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలను ప్రజలను హింసిస్తే టిడిపి ప్రభుత్వం వచ్చాక అన్నింటికీ బదులు తీర్చుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి శ్రీశైలం నియోజకవర్గం సమన్వయకర్త బన్ను రామలింగారెడ్డి, మహానంది మండలం టిడిపి అధ్యక్షులు ఉల్లి మధు, మహానంది ట్రస్ట్ బోర్డ్ మాజీ చైర్మన్ పాణ్యం ప్రసాదరావు, టిడిపి మండల నాయకులు క్రాంతి యాదవ్, ఆర్ ఎస్ గాజులపల్లె సర్పంచ్ అస్లాం భాష, కాకర్ల శివ, శీను, మండల టిడిపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!