వినాయక విగ్రహాలు ఏర్పాటుకు అనుమతి తప్పనిసరి
-మహానంది ఎస్సై నాగేంద్రప్రసాద్
స్టూడియో 10 టీవీ న్యూస్, సెప్టెంబర్ 15, మహానంది:
మహానంది మండలంలో ప్రజలు ఎవరైతే వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసుకునేవారు పోలీస్ స్టేషన్ లో తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని ఎస్సై నాగేంద్రప్రసాద్ శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై నాగేంద్రప్రసాద్ మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా గణేష్ విగ్రహ ప్రతిష్ఠ , పందిళ్ళు, మండపాలు ఏర్పాటు చేసుకోవడానికి ఐదు లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యులతో కమిటీగా ఏర్పడి వారి వివరాలు పోలీస్ స్టేషన్లో తెలియజేయాలన్నారు. పంచాయతీ లేదా ప్రైవేటు స్థలాలలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకుంటే, సంబంధిత స్థల యజమాని లేదా సంబంధిత విభాగపు అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని,నియమ నిబంధనలకు అనుగుణంగా పందిళ్ళు,మండపాలు వద్ద ముందస్తుగా ఇసుక మరియు నీళ్ళను ఏర్పాటు చేసుకోవాలన్నారు.పందిళ్లు,మండపాలలో అగ్ని ప్రమాదాలు జరుగకుండా తగు జాగ్రతలు తీసుకోవాలని,విద్యుత్ వైర్లను ప్రకాశవంతమైన లైట్ల వినియోగంలో జాగ్రతలు వహించాలని,ఎలక్ట్రిక్ షార్ట్ సర్య్కూట్ జరుగకుండా వైరింగ్ జాగ్రత్తగా చేయించుకోవాలని, గణేషుని ప్రతిమల ఎత్తు , బరువు , ఉత్సవం నిర్వహించే రోజుల సంఖ్య , పోలీస్ స్టేషన్లో పూర్తి వివరాలు తెలియజేయాలని మహానంది ఎస్సై నాగేంద్రప్రసాద్ తెలిపారు.