రైతులు మెట్ట పంటలు వేసుకోవాలి.
-మండల వ్యవసాయ అధికారి నాగేశ్వర్ రెడ్డి
స్టూడియో 10 టీవీ న్యూస్, సెప్టెంబర్ 16, మహానంది:
రైతులు మెట్ట పంటలు వేసుకోవాలని మండల వ్యవసాయ శాఖ అధికారి నాగేశ్వర్ రెడ్డి శనివారం రైతులకు సూచించారు. మహానంది మండలం బొల్లవరం గ్రామంలో రైతులతో సమావేశాన్ని నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు గంగ కల్వకు వారబంది పథకంలో భాగంగా రెండో విడత త్రాగు మరియు సాగు కొరకు నీటిని విడుదల చేయడం జరిగిందన్నారు. కెసి ఆయకట్టుకు కూడా నీటిని విడుదల చేయడం జరిగిందన్నారు. కర్నూలు లో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ లతోపాటు ఇరిగేషన్ మరియు వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం జరిగిందని అందులో కేవలం మెట్ట పంటలకు అవసరమయ్యే నీటిని మాత్రమే వారబంది ప్రకారం నీటిని విడుదల చేయాలని తీర్మాంచినట్టు తెలిపారు. రైతులు తొందరపడి ప్రస్తుతం నీరు వదిలారని తెలుగు గంగ కాల్వ కింద వరి నాట్లు వేయవద్దని వేస్తే నీరు అందే పరిస్థితి లేదని రైతులకు సూచించారు. గత కొన్ని రోజుల క్రితం వేసిన పంటలు ఎండిపోకుండా కాపాడడానికి మాత్రమే నీటిని వదులుతున్నట్లు కర్నూల్ లో జరిగిన సమావేశంలో పేర్కొన్నట్లు తెలిపారు. గ్రామంలో వేసిన వరి పైర్లను ఏవో నాగేశ్వర్ రెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ అధికారి చంద్రశేఖర్, వీఆర్వో చలమయ్య మరియు రైతులు పాల్గొన్నారు.