నూతన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు
స్పందించిన విద్యుత్ శాఖ ఏఈ ప్రభాకర్ రెడ్డి
విద్యుత్ శాఖ ఏఈ, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపిన ప్రజలు
స్టూడియో 10 టీవీ న్యూస్, సెప్టెంబర్ 15, మహానంది:
మహానంది మండలం గాజులపల్లె గ్రామంలోని ఎస్సీ కాలనీ యందు ప్రమాదవశాత్తు ట్రాన్స్ఫార్మర్ కాలి శుక్రవారం రాత్రి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వెంటనే మహానంది మండలం విద్యుత్ శాఖ ఏఈ ప్రభాకర్ రెడ్డి ని తెలుపగా వెంటనే ఆయన ఈ విషయంపై స్పందించి, నూతన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్సీ కాలనీ ప్రజలు విద్యుత్ శాఖ ఏఈ ప్రభాకర్ రెడ్డికి, విద్యుత్ శాఖ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.