ఎమ్మెల్యే అవినీతి చుట్ట విప్లమంటారా? మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సామ రామచంద్ర రెడ్డి

ఎమ్మెల్యే ఆనంద్ అవినీతి చిట్టా విప్పమంటారా ?

ఎమ్మెల్యేలను తయారు చేసే సత్తా సామ రాంచంద్రారెడ్డిది

వికారాబాద్, సెప్టెంబర్12(ప్రజాదర్బార్)

వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ చేసిన అవినీతి బాగోతల చిట్టా తమ దగ్గర ఉందని,వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్ కు మున్సిపల్ చైర్మన్ పదవి కోసం రూ.2 కోట్లు,లంక పుష్పాలత రెడ్డి వద్ద రూ.1 కోటి 80 లక్షలు తీసుకున్న మాట వాస్తవం కాదా, అది ప్రజలకు కూడా తెలుసని మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ సామ రాంచంద్ర రెడ్డి విమర్శించారు.గత మూడు రోజుల క్రితం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాంచంద్రారెడ్డి తన అనుచరులతో బీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం విదితమే.ఆ సమావేశంలో పలువురు ఎమ్మెల్యే ఆనంద్ ను విమర్శించగా సోమవారం బీఆర్ఎస్ నాయకులు రాంచంద్రారెడ్డి అతని అనుచరులపై తీవ్ర ఆరోపణలు చేశారు.దానిని వ్యతిరేకిస్తూ మంగళవారం వికారాబాద్ పట్టణంలోని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ నివాసంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి విలేకరులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్,కాంగ్రెస్ నాయకులు రాం చంద్రారెడ్డి మాట్లాడుతూ….1500 ముఖ్యనాయకులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో జీర్ణించుకోలేక తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అలా చేస్తే సహించేది లేదని మండిపడ్డారు. ఎమ్మెల్యే ఆనంద్ ను తన భుజాలపై ఎత్తుకొని గెలిపించనని,అది ఎమ్మెల్యే మర్చిపోయారని అన్నారు.లక్ష్మి కాంత్ రెడ్డి అసలు నాయకుడు కాదని ఆయన కేవలం కాంట్రాక్టర్ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వస్తారని దుయ్యబట్టారు. లక్ష్మికాంత్ రెడ్డి ఎక్కువగా మాట్లాడొద్దని మీ భార్యను మంత్రితో మాట్లాడి మున్సిపల్ ఛైర్మన్ ను చేసింది తాము కదా అని ప్రశ్నించారు.ఎన్నికలో సింహం గుర్తుకు చేసిన వ్యక్తులు మాత్రమే ఎమ్మెల్యే వెంట ఉన్నారని,వారు మాత్రమే మాట్లాడుతున్నారని,వారికి తమపై మాట్లాడే హక్కు లేదని మండిపడ్డారు.ఎమ్మెల్యే చేసిన బాగోతలు చాలా ఉన్నాయని దానిని త్వరలో బయట పెడతామని అన్నారు.బీఆర్ఎస్ పార్టీలో కటికె సురేష్ కు బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఇస్తామంటే తాము పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డికి ఇవ్వాలని చెప్పింది నేను కదా అని సామ రాంచంద్రారెడ్డి ప్రశ్నించారు.వచ్చే 25,30 తేది లోపు భారీ ఎత్తున్న బీఆర్ఎస్ వదిలి కాంగ్రెస్ లోకి చేరనునట్లు జ్యోస్యం చెప్పారు.మీ ఎమ్మెల్యేను మీరు గెలిపించుకోండి,మా ప్రసాద్ కుమార్ ను మెం గెలిపించుకుంటామని సవాళ్లు విసిరారు.సిద్ధులూరు సర్పంచ్ అంజయ్య మాట్లాడుతూ… బీఆర్ఎస్ పార్టీలో వచ్చిన పథకాలకు పైసలు తీసుకునే వ్యక్తి కమల్ రెడ్డి అని,కమల్ రెడ్డి మండల అధ్యక్షుడు అయ్యాక బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోయిందని,మాధవ రెడ్డి ఊరిలో బీఆర్ఎస్ కు డిపాజిట్లు రావన్నారు.కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ… ఎమ్మెల్యే ఆనంద్ కోట్లకు పడగలేతరని,వెంచర్లలో లక్షలు సంపదిస్తున్నారని ఆరోపించారు. ఈ ఎన్నికలో మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రత్నారెడ్డి, కిషన్ నాయక్,రాజశేఖర్, మురళి,బందేల్లి తదితరులు ఉన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!