పార్లమెంటు సమావేశాలలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలి
స్టూడియో 10 టీవీ న్యూస్, సెప్టెంబర్ 16, మహానంది:
పార్లమెంటు సమావేశాలలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలని ఎంఎస్పి జిల్లా నాయకులు నరసింహుడు,జిల్లా కో కన్వీనర్ వెంకటసుబ్బన్న అన్నారు.శనివారం మహానంది మండలం తాహాసిల్దార్ కార్యాలయం వద్ద రెండవ రోజు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.అనంతరం తహాసిల్దార్ జనార్ధన్ శెట్టి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎంఎస్పి జిల్లా నాయకులు నరసింహుడు మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ పట్ల కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో చట్టబద్ధత కల్పించి, మాదిగలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని, లేకపోతే పార్లమెంట్లో బిల్లు తీసుకురాకపోతే మాదిగల ప్రధాన శత్రువు బిజెపి అవుతుందని తెలిపారు.మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎస్సీ వర్గీకరణ సాధించుకుంటామని, అలాగే బిజెపి మెడలు ఒంచి, భారీ ఎత్తున ఆందోళన చేపట్టి, నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణ మాదిగ, మాదిగ ,ఉపకులాల, అంతిమలక్ష్యము అని , మా ,గమ్యమని, వర్గీకరణ మా జీవితాలు వెలుగు నింపుతుందని తెలిపారు.అత్యవసర పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణకుచట్టబద్ధత ,కల్పించి, మాదిగలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని హెచ్చరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు నాగేశ్వరావు, మురళి, రవి కృష్ణ, చరణ్, తదితరులు పాల్గొన్నారు.