బీఎస్పీ పార్టీ వికారాబాద్ మండల అధ్యక్షులుగా జయ రాములు

*బీఎస్పీ పార్టీ వికారాబాద్ మండల అధ్యక్షులుగా జె.రాములు.* ఈ రోజు బీఎస్పీ పార్టీ వికారాబాద్ మండల అధ్యక్షలు గా జె.రాములు నియమితులయ్యారు. ఆయన మాట్లాడుతూ నా పై నమ్మకంతో మండల అధ్యక్షులుగా నియమించినందుకు బీఎస్పీ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు గండు రాజేష్ అన్న గారికి వికారాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి జి.క్రాంతి కుమార్ అన్న గారికి మరియు పార్టీ నాయకులకు ధన్యావాదాలు తెలిపారు. అదేవిధంగా ప్రజల కోసం ప్రజా సమస్యల పై డా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇచ్చిన స్ఫూర్తితో నిరంతరం పని చేస్తునన్నారు.ఈ దోపిడీ దొంగ నాయకుల నుంచి భవిష్యత్ తరలని కాపాడాలనే ఉద్దేశంతో క్రాంతి కుమార్ అన్న నాయకత్వంలో పని చేస్తున్నాని అని అన్నారు. గత డెబ్భై సంవత్సరల నుండి దేశంలోనే అధిక శాతం ఉన్న మన బీసి,ఎస్సీ, ఎస్టీ, మరియు మైనారిటీలను కేవలం ఓటు బ్యాంక్ గా వాడుకుంటూ దేశ సంపద అంతా అగ్రకుల పార్టీలు బిజెపి , కాంగ్రెస్ మరియు బి ఆర్ ఎస్ పార్టీలు అనుభవిస్తున్నాయి అనీ అన్నారు.కావున దేశం లోని బీసీ, ఎస్సీ,ఎస్టీ ప్రజలు వారి మోసాలను పసిగట్టి ఈ దేశ సంపదలో మేము ఎంతో మా వాట అంతే అనే నినాదంతో పని చేయాలన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!