*ఎస్సీ వర్గీకరణ చేయకపోతే బిజేపి ద్రోహానికి నిదర్శనం*
*CWC సమావేశంలో ఎస్సీ వర్గీకరణ బలపరుస్తూ కాంగ్రెస్ తీర్మానం చేయాలి.*
*కోళ్ళ శివ మాదిగ*
*జాతీయ ప్రధాన కార్యదర్శి*
వివరణ:- ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని 29 ఏళ్లుగా మాటలు చెబుతూ ఆచరణలో మోసం చేసిన బిజెపి మాదిగలకు చిరకాల ద్రోహిగా మిగిలిపోతుందని కోళ్ళ శివ మాదిగ అన్నారు
ఎస్సీ వర్గీకరణ బిల్లు ఈనెల 18 జరుగుతున్న ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదించాలని డిమాండ్ చేస్తూ వికారాబాద్ జిల్లా కేంద్రం లో ఎమ్మార్పీఎస్,MSP,MMSఆధ్వర్యంలో నిరాహార దీక్ష ప్రారంభమైంది.
ఈ దీక్షను ప్రారంభించిన కోళ్ళ శివ మాదిగ మాట్లాడుతూ బీజేపీ మాటలు కోటలు దాటుతాయి, ఆచరణ మాత్రం అడుగు కూడా ముందుకు పడదు అని అన్నారు. సాక్షాత్తు ప్రధానమంత్రి వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చిన ఇప్పటికి నెరవేర్చకపోవడం మాదిగలకు ద్రోహం చేయడమే అవుతుందన్నారు. బిజెపి చరిత్రలో ఏదైనా ఒక అంశానికి 30 ఏళ్లుగా మద్దతుగా ఉన్నదంటే అది కేవలం వర్గీకరణకు మాత్రమే అని అన్నారు. 30 ఏళ్లు మద్దతు పలికి చేతుల్లోకి అధికారంలోకి రాగానే వర్గీకరణ గురించి పట్టించుకోకపోవడం బిజెపి అవలంబించే నీచ రాజకీయాలకు నిదర్శనమని అన్నారు. పార్లమెంట్లో సంపూర్ణ మెజార్టీ కలిగి ఉండి త్రిబుల్ తలాక్ ,370 ఆర్టికల్ రద్దు, ఈబిసి రిజర్వేషన్ బిల్లు, ఢిల్లీ పరిపాలన బిల్లు వంటి ఎన్నో అంశాల మీద పార్లమెంటులో రాజ్యాంగ సవరణ బిల్లులను ఆమోదించుకున్న బిజెపి ఎస్సీ వర్గీకరణ మాత్రం విస్మరించి మాదిగల బతుకుల్లోకి చీకటిని నింపిందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో హామీలు ఇవ్వని ఎన్నో సమస్యలను పార్లమెంట్ ద్వారా పరిష్కరిస్తున్న బిజెపి 30 ఏళ్లుగా ప్రతి ఎన్నికల్లో మేనిఫెస్టోలో చేర్చిన వర్గీకరణ సమస్య పరిష్కారం కోసం ఎందుకు ముందుకు రావడం లేదో ఆత్మ పరిశీలన చేసుకోవాలని అన్నారు. వర్గీకరణ చేయకపోతే దక్షిణ భారతదేశంలో ఉన్న కోట్లాదిమంది మాదిగ ప్రజలు బిజెపి శాశ్వతంగా దూరమవుతారన్నారు. తెలంగాణలో ఉన్న నాలుగు ఎంపీ పదవులు కూడా కోల్పోతారని అన్నారు. వర్గీకరణ సాధన కోసం ఉద్యమం ఆగదని అన్నారు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు తీసుకొచ్చి ఇచ్చిన మాటను బిజెపి నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
అలాగే 17 నుండి హైదరాబాద్ లో జరిగే CWC సమావేశాల్లో కేంద్రం మీద వత్తిడి తీసుక వచ్చే విధంగా తీర్మానం చేయాలని అలాగే కాంగ్రెస్ జాతీయ నేతలు అయిన శ్రీమతి సోనియా గాంధీ గారు,రాహుల్ గాందీ గారు ,మల్లిఖార్జున ఖర్గే గారు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయాలని డిమాండ్ చేస్తున్నాం .18 నుండి జరిగే పార్లమెంట్ సమావేశాల్లోనే వర్గీకరణ బిల్లు ప్రవేశ పెట్టే విధంగా BRS MP లు కూడా కృషి చేయాలని డిమాండ్ చేస్తున్నాం ..
ఈ కార్యక్రమానికి జిల్లా ఇంఛార్జి VS రాజు మాదిగ అధ్యక్షత వహించగా దీక్షల్లో మహాజన సోషలిస్ట్ పార్టీ నాయకులు మహేందర్,జినుగుర్తు నర్సింహులు, మహిళ సమాఖ్య జిల్లా నాయకులు పుష్పాలత మాదిగ స్వామి దాస్ మాదిగ , MRPS కొడంగల్ ఇంఛార్జి లు సుభాష్ మాదిగ , బి.దాస్ మాదిగ తదితరులు పాల్గొన్నారు