డి జే లకు అనుమతి తప్పనిసరి
-ఎస్ఐ నాగేంద్రప్రసాద్
స్టూడియో 10 టీవీ న్యూస్, సెప్టెంబర్ 10, మహానంది:
మహానంది మండలంలో జరగనున్న వినాయక చవితి పర్వదిన సందర్భంగా జరిగే కార్యక్రమాల్లో డీ జే లకు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని మహానంది ఎస్సై నాగేంద్ర ప్రసాద్ గ్రామస్తులకు ఆది వారం సూచించారు. ప్రతి గ్రామంలో వినాయక విఘగ్రహాల ఏర్పాటుకు సంబంధించి నమోదు చేసుకోవాలని, లేదంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండలంలో అన్ని గ్రామాల వారికి ఇది వర్తిస్తుందని తెలిపారు. వినాయక చవితి పర్వదిన సందర్భంగా జరిగే ఉత్సవాల్లో అర్లలకు మరియు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామాల్లో ప్రశాంతంగా వినాయక చవితి ఉత్సవాలను జరుపుకోవాలని సూచించారు. గ్రామాల్లో బహిరంగ ప్రదేశాల్లో మరియు హోటల్లో మద్యం సేవిస్తే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మహానంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.