పూడూరు : సమాజంలో అన్ని వృత్తుల కంటే ఉపాధ్యాయవృత్తి ఎంతో గొప్పదని మన్నెగూడ ఎంపీటీసీ మస్రత్ ఆదిల్ అహ్మద్ పేర్కొన్నారు. మంగళవారం పూడూరు మండల కేంద్రంలోని రెసిడెన్షియల్ పాఠశాల మరియు కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఎర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉత్తమ సేవలందిస్తున్న ఉపాధ్యాయులకు మన్నెగూడ ఎంపీటీసీ మస్రత్ ఆదిల్ అహ్మద్ అధ్యక్షతన ఘనంగా సన్మానించి వారి సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలల్లో విద్యార్థులకు క్రమశిక్షణతో పాటు నాణ్యమైన విద్యబోధన చేసే ఉపాధ్యాయులకు సమాజంలో మంచి గుర్తింపు ఉంటుందన్నారు. విద్యార్థుల భవిష్యత్ ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంటుందని పేర్కొన్నారు. విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదిగినప్పుడు మొదట సంతోషించేది ఉపాధ్యాయుడేన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు తమ శక్తి వంచన మేరకు అంకిత భావంతో విధులు నిర్వహిస్తూ ఉత్తమ బోధన చేసే ఉపాధ్యాయులకు సమాజంలో గుర్తింపుతో పాటు సన్మనాలు జరుగుతాయన్నారు. కార్యక్రమంలో పూడుర్ మండల కో ఆప్షన్ సభ్యులు అయుబ్ ఉపాధ్యాయులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.