*అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం.*
— ఎస్సై శ్రీనివాస నాయక్.
అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే వారిపై ఉక్కు పాదం తప్పదని కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు ఎస్సై ఎల్ శ్రీనివాస నాయక్ హెచ్చరించారు. ఆలమూరు స్టేషన్ లో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా బాధ్యతలు చేపట్టి మొదటిసారిగా మీడియాతో మాట్లాడుతూ మండలంలో సారాయి గంజాయి వంటి మత్తు పదార్థాల రవాణా, కలిగి ఉన్న వాటిపై గట్టినిఘా ఏర్పాటు చేశామని, పాఠశాలల జోన్లు వద్ద ఆకతాయిలు ద్విచక్ర వాహనాలపై చెక్కర్లు కొట్టినా, బాలికలపై ఈవ్ టీజింగ్ చేసినా చట్టం తన పని తాను చేసుకుపోతుందని హెచ్చరించారు. అలాగే జాతీయ రహదారిపై ప్రయాణం చేసే ప్రతి వాహనదారుడు ప్రమాదాలు నివారించేందుకు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని, ఎక్కువగా జూదాలపై కేసులు నమోదవుతున్నాయని ఇకపై అలాంటి వాటికి దూరంగా ఉండాలని హితవు పలికారు. మహిళలను, బాలికలను ఎవరైనా ఆకతాయిలు ఇబ్బందులకు గురి చేస్తే వెంటనే తనకు సమాచారం అందించాలని కోరారు. ప్రతి మహిళ తమను కాపాడుకోవడానికి సెల్ఫోన్లో సోస్ యాప్ ఉండాలని యాప్ లేని వారు ఆయా గ్రామాల్లో సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న మహిళ పోలీసులను సంప్రదించాలని తెలిపారు. చట్ట నిబంధనలు పాటిస్తూ పోలీసు వారికి సహకరించాలని కోరారు.