*ముదిరాజ్ కులాస్తులు అన్ని రంగాల్లో రాణించాలి*
*అన్ని రాజకీయ పార్టీలు 18 ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలి*
*ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకులు కాసాని వీరేష్ ముదిరాజ్*
ముదిరాజ్ కులాస్తులు రాజకీయాలే కాకుండా అన్ని రంగాల్లో రాణించి ప్రతి రాజకీయ పార్టీలు రాష్ట్రంలో 18 ఎమ్మెల్యే స్థానాలు కేటాయించేలా ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకులు *కాసాని వీరేష్ ముదిరాజు* పిలుపునిచ్చారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా ముదిరాజ్ సంఘం కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనాభా ప్రతిపాదికన ముదిరాజ్ కులాస్తులకు అన్ని రాజకీయ పార్టీలు న్యాయం చేయాలని ఆయన సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ 60 స్థానాలను బీసీలకు కేటాయించి అందులో 18 స్థానాలు ముదిరాజులకు కేటాయించిందని అన్ని రాజకీయ పార్టీలు ఇదే విధానాన్ని అమలు పరచాలని ఆయన సూచించారు. చట్టసభల్లో బీసీలతో పాటు ముదిరాజ్ కులాస్తులనకు అవకాశం కల్పించాలని సూచించారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో ముదిరాజ్ కులాస్తులకు ముదిరాజ్ భవనాన్ని నిర్మాణానికి కాసాని జ్ఞానేశ్వర్ శ్రీకారం చుట్టారని అతి త్వరలో వికారాబాద్ జిల్లా కేంద్రంలో ముదిరాజ్ భవనం తయారవుతుందని ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల పైచిలుకు ముదిరాజులు ఉన్నప్పటికీ అధికార పార్టీ ఒక్క ముదిరాజులకు కూడా ఎమ్మెల్యే అవకాశం ఇవ్వలేక పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముదిరాజ్ కులాస్తులందరూ రాజకీయాలకతీతంగా ఏకమై పోరాటం చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ ముదిరాజ్, రాష్ట్ర నాయకులు నర్సింలు ముదిరాజు, సావిత్రమ్మ ముదిరాజు, కౌన్సిలర్ గోపాల్ ముదిరాజ్, పాండు ముదిరాజ్, ఆంజనేయులు ముదిరాజ్, రాజు గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ లక్ష్మణ్ ముదిరాజ్, రామచంద్రయ్య ముదిరాజ్ ,సత్యనారాయణ ముదిరాజ్, కడియాల వేణు ముదిరాజు ,సత్యం ముదిరాజ్ ,గోపాల్ ముదిరాజు, మాణిక్యం ముదిరాజ్, కరణం రఘు ముదిరాజ్ ,లాలయ్య ముదిరాజ్ ,రామస్వామి ముదిరాజ్ ,వివిధ రాజకీయ పార్టీల నాయకులు ముదిరాజ్ సంఘం సభ్యులు జిల్లాలోని అన్ని మండలాల ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.