పంచాయతీ కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలి

వికారాబాద్ జిల్లా…

మాట తప్పిన ముఖ్యమంత్రి
పంచాయతీ కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలి
పేపర్లకే పరిమితమైన ముఖ్యమంత్రి పర్మినెంట్ హామీలు
మున్సిపల్ కార్మికులకు మద్దతు తెలిపిన వికారాబాద్ తీన్మార్ మల్లన్న టీం

వికారాబాద్ జిల్లా… వికారాబాద్ లోని మున్సిపల్ ఆఫీస్ గేటు దగ్గర మున్సిపల్ కార్మికులు తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాలని కార్మికులు ముక్తకంఠంతో డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా తీన్మార్ మల్లన్న టీం జిల్లా అధ్యక్షులు ఘనపురం శ్రీనివాస్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకు మద్దతు తెలపడం జరిగింది. అనంతరం మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేస్తామని గతంలో చెప్పిన కేసీఆర్ తొమ్మిదేళ్ల పాలనలో ఇప్పటివరకు కాంటాక్ట్ అవుట్సోర్సింగ్ కింద పని చేస్తున్న మున్సిపల్ కార్మికులను ఇప్పటివరకు రెగ్యులర్ చేయలేదని , సమాన పనికి సమాన వేతనం అన్న సుప్రీంకోర్టు గైడ్లైన్స్ను పాటించకుండా చాలీచాలని జీతాలతో కుటుంబాలు గడుపుతున్న కార్మికులను తక్షణమే పర్మినెంట్ చేసి జీతాలు పెంచాలని డిమాండ్ చూస్తున్న మున్సిపల్ కార్మికులు , మొదట్లో రెండువేల జీతం తో ఉద్యోగంలో చేరి జీతం తీసుకుని , ప్రస్తుతం 13000 జీతంతో బ్రతుకుతున్నామని ఈ వేతనాలతో కుటుంబ పోషణ కష్టం అవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కష్టకాలంలో అనేక సేవ చేసామని కరోనాతో ఇబ్బంది పడుతున్న వ్యక్తులను సైతం వాళ్ళ చుట్టూ పరిసరాలను శుభ్రం చేసి మా ప్రాణాలను పణంగా పెట్టి కూడా ప్రజల యోగ క్షేమాలు చూశారని శానిటేషన్ ,డ్రైనేజీ, వాటర్ , క్లీనింగ్ తదితర పనులు అన్నిటిని తాము చేస్తూ కంపులో పనిచేసుకుంటూ కూడా ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వం మాపై జాలి చూపించలేదని కనీసం ఇప్పటికైనా కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులను గుర్తించి పర్మినెంట్ చేయాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నామని తెలుపుతూ… సకలజనుల సమ్మె చేసినప్పుడు కూడా తెలంగాణ ఉద్యమంలో రోడ్లపైకి వచ్చి వండావార్పులు ధర్నాలు చేస్తే శుభ్రం చేసి తెలంగాణకు మద్దతుగా నిలబడ్డామని రాష్ట్రం వచ్చినా కానీ మున్సిపల్ కార్మకులకు ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ప్రభుత్వం వారు చేసిన సేవలను గుర్తించి న్యాయం చేయాలని లేకపోతే వ్యవస్థ మొత్తం స్తంభింప చేస్తామని నాలుగు రోజులు చెత్త శుభ్రం చేయకపోతే ఏమవుతుందో తెలుసా! ఒక సారిగా రోగాలు ప్రబలే అవకాశం ఉందని దాని ద్వారా అనేకమంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని అనారోగ్య భరిన పడతారని గ్రహించాలని వారు చేస్తున్నటువంటి శాంతియుత నిరసన కార్యక్రమానికి మద్దతు తెలుపుతున్న అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ వారు చేస్తున్న న్యాయమైనటువంటి ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని తమరికి తెలుపుతూ తెలపడం జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ నాయకులు నరేష్ పటేల్ , వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు గణపురం శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి పవన్ కుమార్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ సాకేత్ గుప్తా తదితరులు పాల్గొన్నారు..

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!