భక్తులకు మహానందీశ్వరుని నిరంతర నిజరూప దర్శన భాగ్యం..

భక్తులకు మహానందీశ్వరుని నిరంతర నిజరూప దర్శన భాగ్యం..

మహానంది పుణ్యక్షేత్రంలో ఆదివారం శ్రావణ శుద్ధ ఏకాదశి 27-8-2023 వ తేదీ నుండి మహానంది పుణ్యక్షేత్రంలో భక్తులకు మహానందీశ్వరుని నిజరూప దర్శనం నిరంతరాయంగా కొనసాగించేవిధంగా చర్యలు తీసుకున్నట్లుగా ఆలయ ఈఓ చంద్రశేఖర్ రెడ్డి,పాలక మండలి చైర్మన్ మహేశ్వర్ రెడ్డి లు తెలిపారు.ఈ సందర్భంగా ఆలయ ఈవో మాట్లాడుతూ శని,ఆది,సోమవారములు మరియు పర్వదినములలో ఉదయం 7-30నుండి11-00వరకు మిగిలిన రోజుల్లో ఉదయం 7-30నుండి9-30వరకు మాత్రము పంచామృతాభిషేకం చేసుకొనుటకు ఏర్పాటు చేస్తూ,మిగిలిన సమయాల్లో శుద్ధమైన ఆవుపాలు&స్వఛ్ఛమైన గంగనీరుతో అభిషేకం చేసుకొనుటకు,మరియు గర్భాలయ దర్శనం కూడా నిరంతరం నిజరూప దర్శనం ఉండేవిధంగా ఏర్పాటు చేశము అన్నారు. అంతేకాకుండా
ఆదివారం నుంచి క్షేత్రం లో లడ్డు, పులిహోరలతో పాటు వడ ప్రసాదమును భక్తులకు అందుబాటులోకి తేవడమైనది అన్నారు. కావున భక్తాదులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని స్వామి అమ్మ వార్ల కృపాకటాక్షాలకు పాత్రులు కాగలరని ఆలయ పండితులు, అర్చకులు కోరారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!