ప్రభుత్వ అనుమతులు లేని పురుగు మందుల అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు…
-మండల వ్యవసాయ శాఖ అధికారి నాగేశ్వర్ రెడ్డి
స్టూడియో 10 టీవీ న్యూస్, ఆగస్టు 25, మహానంది:
మహానంది మండలం గాజులపల్లె గ్రామంలోని దీప్తి ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ మరియు గఫారియా పెస్టిసైడ్స్ ఎరువులు మరియు పురుగు మందుల దుకాణంలలో మండల వ్యవసాయ అధికారి నాగేశ్వర్ రెడ్డి తనిఖీ శుక్రవారం తనిఖీ చేశారు.ఈ తనిఖీ లో కొన్ని రసాయన పురుగుమందులకు సంబంధించి,అనుమతులు లేనందున ఒక్క లక్ష 11 వేల 245 రూపాయలు విలువ చేసే రసాయనిక పురుగు మందుల అమ్మకాలను నిలుపుదల చేసారు.ఈ సందర్భంగా ప్రభుత్వ అనుమతులు లేని ఎరువులు మరియు పురుగుమందులను అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరిగినది. ఎరువులు కొనుగోలు చేసిన రైతులకు ఖచ్చితంగా బిల్లులు ఫారం ఎమ్ లో ఇవ్వాలని, అదేవిధంగా బిల్లులో రైతుల సంతకాలు తీసుకోవాలని డీలర్లను హెచ్చరించారు.అలాగే ఎరువుల కృత్రిమ కొరత సృష్టించి గరిష్ట చిల్లర ధర కంటే అధికముగా అమ్మితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడమైనది. రైతులు ఎరువులు లేదా పురుగుమందులు తీసుకున్నప్పుడు తప్పకుండా బిల్లులో సంతకము చేసి బిల్లులు తప్పకుండా తీసుకోవాలని కోరారు.