గోపవరంలో భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం
స్టూడియో 10 టీవీ న్యూస్, ఆగస్టు 22, మహానంది:
మహానంది మండలం గోపవరం గ్రామంలో శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు శ్రీశైలం నియోజకవర్గ సమన్వయకర్త బన్నూరు రామలింగారెడ్డి ఆధ్వర్యంలో భవిష్యత్తుకు గ్యారెంటీ, మహాశక్తి కార్యక్రమం మంగళవారం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీశైలం నియోజకవర్గం మహాశక్తి కన్వీనర్ గంగాదేవి హాజరై ఆమె మాట్లాడుతూ మహాశక్తి పథకం కింద 18 ఏళ్లు నిండిన స్త్రీకి ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500, తల్లికి వందనం పథకం కింద మీ ఇంట్లో ఎంత మంది పిల్లలు చదువుకుంటే వారందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి 15వేలు, తల్లికి వందనం పథకం కింద మీ ఇంట్లో ఎంత మంది పిల్లలు చదువుకుంటే వారందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి 15వేల రూపాయలు, దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం, ఉచిత బస్సు ప్రయాణం పథకం ద్వారా మహిళలందరికీ టికెట్లు లేని ప్రయాణం తదితర పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మహానంది మండలం టిడిపి అధ్యక్షుడు ఉల్లి మధు, గోపవరం గ్రామ నాయకులు క్రాంతి కుమార్, గాజులపల్లె శశికళ,వెంకట లక్ష్మమ్మ,ఈర్నపాడు లక్ష్మి,గోపవరం మాజీ ఎంపీపీ చింతం నాగమణి, గ్రామమహిళలు, తదితరులు పాల్గొన్నారు.