*తిరుపతి పారీశుధ్యానికి అధిక ప్రాధాన్యత – టీటీడీ చైర్మెన్ భూమన కరుణాకర రెడ్డి*
తిరుపతి నగరం( స్టూడియో టెన్ న్యూస్ )
దేశంలోని ఇతర నగరాల కన్నా సుందరంగా ఆదర్శ వంతమైన పారీశుధ్య నగరంగా తిరుపతి నగరాన్ని తీర్చిదిద్దేందుకు తిరుపతి నగరపాలక సంస్థ కృషి చేస్తున్నదని టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కొత్తగా కొనుగోలు చేసిన 12 ట్రాక్టర్లను టీటీడి చైర్మెన్ భూమన కరుణాకర రెడ్డి ముఖ్య అతిథిగా, తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత ఐఏఎస్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది.*
*ఈ సందర్భంగా భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ తిరుపతి నగరం పెద్ద ఎత్తున విస్తీర్ణం అవుతున్నదని, నగరంలో నివాసం వుండాలనే ప్రజల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నదని, దానికి అనుగుణంగా తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ తగిన చర్యలు తీసుకుంట్టున్నదని తెలిపారు. ఒకవైపు స్వచ్ఛ సర్వేక్షన్ లో భాగంగా తిరుపతిని క్లీన్ నగరంగా తీర్చిదిద్దడంతోపాటు, మరోవైపు అందమైన, విశాలమైన రోడ్లను వేయడం, రహదారుల కూడళ్ళు, ఫ్రీ లెఫ్ట్ ల వద్ద మంచి అలంకరణతో కూడిన శిల్పాలు, చిత్రకళలు ఏర్పాటు చేయడంతో తిరుపతి నగరానికి ఒక విశిష్టత ఏర్పడిందని భూమన కరుణాకర రెడ్డి అన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత ఐఏఎస్ మాట్లాడుతూ ప్రపంచ స్థాయిలో తిరుపతి నగరానికి ఉన్న విశిష్టతను దృష్టిలో ఉంచుకొని, స్వచ్ఛ సర్వేక్షన్ లో భాగంగా పరిశుభ్రత నగరంగా రూపొందించేందుకు ప్రణాళిక బద్ధంగా తగు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. తిరుపతి నగరంలో పారిశుధ్యానికి ప్రధాన్యత ఇచ్చే భాగంగా తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ 1 కోటి 23 లక్షలతో పారిశుధ్య నిర్వహణ కొరకు 12 ట్రాక్టర్లను కొనుగొలు చేయడం జరిగిందన్నారు. తిరుపతి ప్రజలు, కౌన్సిల్ సభ్యులు, అధికారులు, కార్మికులు అందరి సహకారంతో తిరుపతి అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత ఐఏఎస్ తెలిపారు. అంతక్రితం నగరంలోగల మారస సరోవర్ మార్గంలోని బిడి కాలనీలో 40 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డుని టీటీడీ చైర్మెన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత ఐఏఎస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఆధం రాధాకృష్ణ రెడ్డి, బోకం అనీల్ కుమార్, తిరుపతి మునిరామిరెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, మునిసిపల్ ఇంజనీర్ వెంకట్రామిరెడ్డి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్వేష్ రెడ్డి, డిఈ విజయకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.