*తిరుమల లో గరుడ పంచమి సందర్భంగా వైభవంగా గరుడ సేవ*

తిరుమల గరుడపంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని సోమవారం రాత్రి తిరుమలలో శ్రీమలయప్పస్వామివారు తనకు ఇష్టవాహనమైన గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులను కటాక్షించారు. రాత్రి 7 నుండి 9 గంటల నడుమ గరుడ వాహనసేవ అత్యంత రమణీయంగా జరిగింది.   

శ్రీవారి వాహనాల్లోను, సేవకుల్లోను అగ్రగణ్యుడు గరుడుడు. ప్రతి ఏడాదీ గరుడ పంచమిని శుక్ల పక్షం ఐదవ రోజు ఘనంగా నిర్వహిస్తారు. నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనందదాయకంగా వుండేందుకు, స్త్రీలు తమకు పుట్టే సంతానం గరుడునిలాగా, బలశాలిగా ఉండేందుకు ఈ సందర్భంగా  ”గరుడ పంచమి” పూజ చేస్తారు.

ఈ కార్యక్రమంలో సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్, ఎస్ఇ-2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, డెప్యూటీ ఈవోలు శ్రీ హరీంద్రనాథ్, శ్రీ రాజేంద్ర, పేష్కార్ శ్రీ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!