గడప గడపలో జగనన్న పాలనపై ప్రజలకు నమ్మకం ఉంది
ఎమ్మెల్యే శిల్పా ను భారీ గజమాలతో స్వాగతం పలికిన నాయకులు
-ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి
స్టూడియో 10 టీవీ న్యూస్, ఆగస్టు 22, మహానంది:
గడప గడపలో జగనన్న పాలనపై ప్రజలకు నమ్మకం ఉందని, అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి సంక్షేమ పథకాలు అందుతాయని శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. మంగళవారం మహానంది మండలం తిమ్మాపురం గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి పాల్గొన్నారు. ముందుగా నాయకులు క్రేన్ సాయంతో భారీ గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు.ముందుగా తిమ్మాపురంలోని గ్రామ సచివాలయాన్ని, సిసి రోడ్డును ఎమ్మెల్యే శిల్పా చేతుల మీదుగా ప్రారంభించారు.అనంతరం ఎమ్మెల్యే శిల్పా ప్రతి గడప గడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిని వివరించి నాలుగేళ్ల పాలనలో అందించిన సంక్షేమ బుక్ లను అందించి ప్రభుత్వ పథకాల లబ్దిని వివరించడం జరిగింది.గ్రామంలో స్థానికంగా ఉన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకుని, సంబంధిత అధికారులకు పరిష్కరించాలని తెలియజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే శిల్పా మాట్లాడుతూ సంక్షేమ పథకాలు లబ్ది పొందిన లబ్ధిదారులు జగనన్న పై పూర్తి విశ్వాసంగా ఉన్నారని,సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ముఖ్య మంత్రి జగనన్న కు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలన్నారు. కుల, మత, వర్గ, వివక్ష తేడా లేకుండా సంక్షేమ పధకాలను అందిస్తున్న జగనన్న ను, ఎమ్మెల్యే ను ఆశీర్వదించాలని కోరారు.
ప్రతి నెలా ఒకటవ తేదీన పింఛన్లు పొందుతున్న వృద్ధుల ఆశీస్సుల్లతో, అమ్మ ఒడి కృతజ్ఞతతో పిల్లలను బడికి పంపుతున్న తల్లుల చిరునవ్వులు ఇలాగే కొనసాగాలంటే వైసీపీ ప్రభుత్వం తోనే సాధ్యమన్నారు. పేదవాని సొంతింటి కలను బాధ్యతగా తీసుకొని నెరవేరుస్తున్న ఘనత జగనన్న దే అన్నారు. నవరత్నాల హామీలను 100 శాతం నెరవేర్చిన సీఎం జగనన్న ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని ఎమ్మెల్యే శిల్పా కోరారు.
ఈ కార్యక్రమంలో శ్రీశైలం నియోజకవర్గం సమన్వయకర్త శిల్పా భువనేశ్వర్ రెడ్డి, రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటీఫికేషన్ డైరెక్టర్ నాగభూపాల్ రెడ్డి, మహానంది తాహాసిల్దార్ జనార్దన్ శెట్టి, మండల అధ్యక్షురాలు బుడ్డారెడ్డి యశస్విని, ఎంపీడీవో శివ నాగజ్యోతి, మండల వ్యవసాయ శాఖ అధికారి నాగేశ్వర్ రెడ్డి, విద్యుత్ శాఖ ఏఈ ప్రభాకర్ రెడ్డి, ఎస్ఐ నాగేంద్రప్రసాద్, డిప్యూటీ తాసిల్దార్ శ్రీనివాసులు, భూ రీ సర్వే డిప్యూటీ తహాసిల్దార్ కామేశ్వర్ రెడ్డి, జెడ్పిటిసి కెవిఆర్ మహేశ్వర్ రెడ్డి,మహానంది దేవస్థానం చైర్మన్ కొమ్మా మహేశ్వర్ రెడ్డి, సర్పంచ్ శ్రీలక్ష్మి, ఎంపీటీసీ స్వరూప, వైసిపి నాయకులు ఒంటెద్దు వీరారెడ్డి, ఏపీ మదాసికురువ రిజర్వేషన్ పరిరక్షణ సమితి శ్రీశైలం నియోజకవర్గ కన్వీనర్ గజ్జ పెద్ధపక్కీరయ్య,సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, వైసిపి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.