జాతీయ ర్యాగింగ్ నిరోధక దినోత్సవ కార్యక్రమం
ముఖ్యఅతిథిగా హాజరైన ఎస్ఐ నాగేంద్రప్రసాద్
ఘనంగా ఎస్సై కి సన్మానం
స్టూడియో 10 టీవీ న్యూస్, ఆగస్టు 19, మహానంది:
మహానంది మండలంలోని మహానంది వ్యవసాయ కళాశాల యందు జాతీయ ర్యాగింగ్ నిరోధక దినోత్సవ కార్యక్రమం కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ కె. ఎస్. ఎస్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహానంది ఎస్సై నాగేంద్ర ప్రసాద్ హాజరై ఆయన మాట్లాడుతూ నేడు అనేక పాఠశాలల్లో ర్యాగింగ్ పెనుభూతమై విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతుందని, విద్యార్థులందరూ కలిసిమెలిసి చక్కగా చదువుకోవాలని,పలు సూచనలు చేశారు. కళాశాల డీన్ మాట్లాడుతూ ర్యాగింగ్ లో విద్యార్థులు పాల్గొన్న, ప్రోత్సహించిన తగు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం మహానంది ఎస్సై నాగేంద్ర ప్రసాద్ ని ఘనంగా సన్మానించారు. అలాగే కళాశాలలోని విద్యార్థిని విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్ తదితరల పోటీలు నిర్వహించి ఎస్సై చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పివి రమేష్ బాబు, ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి, కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.