*ముఖ్యమంత్రి చేతుల మీదుగా మరో నెలలో శ్రీనివాస సేతు ప్రారంభం – కమిషనర్ హరిత ఐఏఎస్*
తిరుపతి
తిరుపతి నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద శ్రీనివాస సేతు తుది దశ పనులను శుక్రవారం తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ హరిత ఐఏఎస్ మాట్లాడుతూ శ్రీనివాస సేతు నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయని, మరో నెల లోపు అన్ని పనులను పూర్తి చేసి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే మొదటి దశలో శ్రీనివాసం ముందు నుండి లీలామహల్ సర్కిల్ మీదుగా కపిలతీర్థం వరకు, అదేవిధంగా కపిలతీర్థం నుండి శ్రీనివాసం వరకు మొదటి దశ శ్రీనివాససేతును ప్రజలకు అందుబాటులోకి తేవడం జరిగిందని, రెండవ దశలో భాగంగా కరకంబాడి రోడ్డు మద్దిమానుల ప్రాంతం నుండి లీలామహల్ సర్కిల్ మీదుగా, కపిలతీర్థం వరకు శ్రీనివాససేతును తీసుకురావడం జరిగిందని, మూడవ విడతలో భాగంగా తిరుచానూర్ సర్కిల్ మ్యాంగో మార్కెట్ నుండి రామానుజ సర్కిల్ మీదుగా రేణిగుంట రోడ్డు కళాంజలి వరకు, అదేవిధంగా కళాంజలి సర్కిల్ నుండి మ్యాంగో మార్కెట్ వరకు శ్రీనివాససేతు పనులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని, తుది దశలో భాగంగా ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని రైల్వే బ్రిడ్జి వద్ద పనులు చేపట్టడం జరిగిందని, మరో నెలలోపు ఈ పనులు పూర్తి చేసి మొత్తం శ్రీనివాస సేతు ప్రాజెక్టుని ప్రజలకు అందించడం జరుగుతుందని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ అన్నారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజినీర్ మోహన్, ఆప్కాన్ సంస్థ ప్రతినిధి రంగస్వామి పాల్గొన్నారు.