- తిరుగబడు- తరిమికొట్టు కార్యక్రమంలో….
- కాంగ్రెస్ పార్టీ నాయకురాలు జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ…
టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదేశానుసారం మల్దకల్ మండల పరిధిలోని అమరావాయి గ్రామంలో “తిరుగబాడు- తరిమికొట్టు” కార్యక్రమంలో భాగంగా అసెంబ్లీ కో- ఆర్డినేటర్ జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ అధ్వర్యంలో అమరావాయి గ్రామంలోని పురవీధులలో తిరిగి గ్రామంలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.. ప్రధానంగా డబుల్ బెడ్ రూం, తెల్ల రేషన్ కార్డు, పించన్లు,రోడ్లు, డ్రైనేజీ వంటి సమస్యలను జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ దృష్టికి గ్రామస్థులు తీసుకువచ్చారు.. అక్కడక్కడ చేరికలు ఏర్పాటు చేసిన వేదికల వద్ద వివిధ పార్టీల కార్యకర్తలు, నాయకులను కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సరితమ్మ సమక్షంలో చేరారు.. గ్రామంలోని గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు..అక్కడక్కడా అభిమానం చూపిస్తూ మహిళలు పూలమాలలు వేసి సన్మానించారు.. చర్చిలో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు…తెలంగాణ రాష్ట్రములో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఒకేసారి 2లక్షల రుణ మాఫీ,మొదటి విడతలోనే 2 లక్షల ఉద్యోగల భర్తీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్దంగా ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ అన్నారు… అధికార బిఆర్ఎస్ పార్టీ మాటలు తప్ప చేతలో అభివృద్ధి లేదని పేర్కొన్నారు.. కొంతమంది బిఆర్ఎస్ పార్టీ నాయకులకు,కార్యకర్తలకు మాత్రమే దళిత బంద్, బిసి బంద్, మైనారిటీ బంద్ వంటి పథకాలు అందజేసినంత మత్రన నిరుపేద కుటుంబాలు అభివృద్ధి చేసినట్లు గొప్పలు చెప్పుకుంటూ బిఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పుకుంటున్నారు…కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, ప్రతి నిరుపేద కుటుంబానికి ఇల్లు, రేషన్ కార్డు,ఉద్యోగ అవకాశాలు, ఆరోగ్యశ్రీ, గ్యాస్ 500 తదితర సంక్షేమ పథకాలు అందరికీ అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు… ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బండ్ల చంద్రశేఖర్ రెడ్డి, అమరావాయి కృష్ణారెడ్డి, గట్టు కృష్ణ, రేపల్లె కృష్ణ,శ్రీకాంత్ రెడ్డి,మల్లేందొడ్డి మద్దిలేట్టి, రాఘవేంద్ర రెడ్డి,తిమ్మప్ప, మధు,పూడూర్ ఈశ్వర్ నాయుడు,ఇమ్మానేయిల్,భాస్కర్ రెడ్డి,ఎల్కూర్ నరసింహులు,బాలు,తిమ్మప్ప,మహబూబ్,ఆంజనేయులు గ్రామస్థులు తదితరులు ఉన్నారు…