జోగుళాoబ గద్వాల్ జిల్లా పోలీస్
జిల్లా పోలీస్ కార్యాలయం లో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు
గద్వాల్: ఎలాంటి వారసత్వ రాజ్యపరిపాలన లేని వ్యక్తి కేవలం స్నేహితులు తో మొదలై వేల సంఖ్యలో స్వంతంగా సైన్యం ను ఏర్పాటు చేసుకొని తెలంగాణ ప్రాంతాన్ని పట్టిపీడిస్తున్న మొఘల్ పాలకుల అరాచకాలను, భూస్వాములు, దొరల గుత్తాధిపత్యాన్ని ఎదిరించి తానే సొంతంగా ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఏకంగా గోల్కోండ కోటనే ఏలిన ధీరుడిగా చరిత్రకెక్కిన ఒక బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్ర అందరికీ ఆదర్శమని జిల్లా అదనపు ఎస్పీ శ్రీ ఎన్.రవి గారు అన్నారు.
ఈ రోజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 373వ జయంతి సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీమతి కె. సృజన గారి ఆదేశాల మేరకు జిల్లా అదనపు ఎస్పీ గారు జిల్లా పోలీస్ కార్యాలయం లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా అదనపు ఎస్పీ గారు మాట్లాడుతూ బహుజనులకే రాజ్యాధికారం దక్కాలని 17వ శతాబ్ధంలోనే గొంతెత్తి నినదించడమే కాకుండా పిడికిలి ఎత్తి పోరాడి గెలిచిన యోధుడు సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు. సాధారణ వ్యక్తిగా ఉంటూ తనకు ఎదురైన అణిచివేతలను ఎదుర్కొంటు తానే సైన్యం ను తయారు చేసుకొని దొరల గడిలను, భూస్వామ్య గుత్తాదిపత్యాన్ని అణిచివేసిన బహుజనుడని, మొఘల్ సామ్రాజ్యాన్ని సైతం ఎదిరించి 20 కోటలను జయించడం తో పాటు గోల్కొండ కోట పై బహుజన రాజ్య స్థాపన జెండా ఎగురవేసిన వ్యక్తి పాపన్న గౌడ్ అని అన్నారు. భావితరాలకు పోరాట స్పూర్తినిచ్చే వారి జీవితాలు చరిత్ర పుటల్లో ఘన కీర్తిని సొంతం చేసుకున్నాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కార్యాలయ ఏ . ఓ సతీష్ కుమార్ గారు, డిసి ఆర్బి ఇన్స్పెక్టర్ రామ స్వామి గారు, ఎస్సై రామ కృష్ణ గారు,సుపరిండెంట్ నయీమ్ గారు, ఐటీ సెల్, డీసీ ఆర్బీ, ఎస్బి మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా పోలీస్ కార్యాలయం
జోగుళాoబ గద్వాల్ జిల్లా