తప్పనిసరిగా రైతులందరూ ఈ పంట నమోదు చేసుకోవాలి
-మండల వ్యవసాయ శాఖ అధికారి నాగేశ్వర్ రెడ్డి
స్టూడియో 10 టీవీ న్యూస్, ఆగస్టు 18, మహానంది:
తప్పనిసరిగా రైతులందరూ ఈ పంట నమోదు చేసుకోవాలని వ్యవసాయ అధికారి బి. నాగేశ్వరరెడ్డి అన్నారు.మహానంది మండలం అబ్బీపురం గ్రామంలోని పంట నమోదు కార్యక్రమాన్ని వ్యవసాయ అధికారి బి. నాగేశ్వరరెడ్డి శుక్రవారం పర్యవేక్షించారు. మండలంలోని అన్ని రైతు భరోసా కేంద్రాలలో, ఈ పంట నమోదు కార్యక్రమము ప్రారంభం అయిందని తెలియజేశారు.రైతు భరోసా కేంద్రం సిబ్బంది, రైతులు వేసిన ప్రతి పంటను పొలం దగ్గరకు వెళ్లి తప్పులు లేకుండా ఈ పంట నమోదు చేయాలన్నారు.ప్రతి రైతు తాను వేసిన పంట వివరాలను సంబంధిత రైతు భరోసా కేంద్రంలోని వ్యవసాయ శాఖ సిబ్బందిని కలిసి పంట నమోదు చేయించుకోవాలన్నారు.. రైతులు తమ పంటను ఆన్లైన్లో నమోదు చేసుకోవడం వల్ల, ప్రకృతి వైపరీత్యాల వలన పంట నష్టం జరిగినప్పుడు, పెట్టుబడి రాయితీ పొందడానికి అర్హులు అవుతారని, అలాగే పంట బీమా పొందడానికి , రైతులు తాము పండించిన పంటను ప్రభుత్వ మద్దతు ధరకు అమ్ముకోవడానికి , రైతు భరోసా మరియు సున్నా వడ్డీ రాయితీ వర్తించడానికి,తదితర ప్రభుత్వ పథకాల లబ్ధి పొందడానికి పంట నమోదు తప్పనిసరని,రైతులు ఈ క్రాప్ బుకింగ్ నమోదులో సహకరించాలని కోరారు.రైతులు తమ పంటను ఆన్లైన్లో నమోదు చేసుకోవడానికి సెప్టెంబరు 15 చివరి తేదీ అని తెలియజేశారు.ఈ మండల వ్యవసాయ అధికారి బి. నాగేశ్వర రెడ్డి, వి ఏ ఏ కృష్ణ కాంత్, గ్రామ రైతులు పాల్గొన్నారు.