వేద ఆశీర్వాదాలతో బాధ్యతలు చేపట్టిన జాయింట్ కలెక్టర్
స్టూడియో 10 టీవీ న్యూస్, ఆగస్టు 18,మహానంది:
నంద్యాల జిల్లా జెసి కార్యాలయంలో జిల్లా జాయింట్ కలెక్టర్ గా తాటిమాకుల రాహుల్ కుమార్ రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి సమాచారం అందుకున్న మహానంది దేవస్థానం ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి, ట్రస్టు బోర్డు చైర్మన్ కొమ్మా మహేశ్వర్ రెడ్డి,పర్యవేక్షకులు ఓ వెంకటేశ్వర్లు, ఆధ్వర్యంలో వేద పండితులు రవిశంకర్ అవధాని, హనుమంత రాయ శర్మ, అర్చకులు అర్జున్ శర్మలు వేదమంత్రాల సాక్షిగా జెసి బాధ్యతలను స్వీకరించారు.అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనాలు చేసి, తీర్థప్రసాదాలు అందజేయగా, ఆలయ ఈవో,చైర్మన్ శేష వస్త్రంతో సత్కరించి స్వామి వారి జ్ఞాపికను అందజేశారు.అదెవిధంగా
నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి ఆగస్ట్ 15,వ తేదీన ఇండియన్ ప్రెసిడెంట్ అవార్డు అందుకున్న సందర్భంగా జిల్లా ఎస్పీని కలిసి శ్రీ కామేశ్వరీ దేవి, మహానందీశ్వరుల ఆశీస్సులతో ఇంకా ఉన్నత స్థానాలు అధిరోహించాలని ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి, ట్రస్టు బోర్డు చైర్మన్ కొమ్మా మహేశ్వర్ రెడ్డి లు అన్నారు.స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి, స్వామివారి జ్ఞాపికను అందజేయగా, వేదపండితులు రవి శంకర అవధాని వేద ఆశీర్వచనాలు చేసి, స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మహానంది దేవస్థానం పర్యవేక్షకులు ఓ.వెంకటేశ్వర్లు, వేద పండితులు రవిశంకర్ అవధాని, హనుమంత రాయ శర్మ, అర్చకులు అర్జున్ శర్మలు, తదితరులు పాల్గొన్నారు.