గాజులపల్లె మదరసాలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
స్టూడియో 10 టీవీ న్యూస్, ఆగస్టు 15, మహానంది:
స్వాతంత్య్రోద్యమం వేగం అందుకుని లక్ష్యసాధన దిశగా పరుగులిడుతున్న ఆ దశలో ఆ ఉద్యమంలో భాగస్వాములై వీర మరణం చెందిన ముస్లీంలు అదృష్టవంతులని మౌలానా అబ్దుల్ మన్నన్ అన్నారు.మహానంది మండలం గాజులపల్లె గ్రామంలోని మదరసా ఏ హయాతుల్ ఇస్లాంలో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మదారసా నిర్వాహకులు అబ్దుల్ మన్నన్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు.అలాగే గాజులపల్లె మెట్ట నందు రహ్మతులిల్ ఆలమీన్ మసీదులో కూడా త్రివర్ణ పథకాన్ని ఎగరవేసి జాతీయ వందనం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1947 ఆగస్టు పదిహేనున భారతదేశం వందల ఏళ్ళ బానిసత్వాన్నుంచి విడుదలయిందని దానికి గుర్తుగా, ప్రభుత్వం ఆగస్టు పదిహేనుని భారత స్వాతంత్ర్య దినోత్సవంగా ప్రటించారని తెలిపారు.భారత స్వాతంత్య్ర పోరాటంలో ముస్లింలు చాలా గొప్ప పాత్ర పోషించారని,స్వతంత్రం కోసం ఎన్నో బలిదానాలు చెసారని,మరెందరో అమరులు అయ్యారని, భారతీయుల పోరాట పటిమతో బ్రిటీష్ వారిని ఎదిరించి భారతదేశానికి స్వాతంత్య్రం సాధించుకున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు, విద్యార్థులు పాల్గొన్నారు.