భారత దేశం యొక్క గౌరవాన్ని పెంచిన నాయకుడు మన ప్రధాని నరేంద్ర మోడీ
15-08-2023 మంగళవారం రోజున 77 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని చేవెళ్ల భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు మన చేవెళ్ల మాజీ పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారు ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది మరియు స్వీట్లు పంచి శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. వారు మాట్లాడుతూ భారతదేశం యొక్క గొప్పతనాన్ని మరియు నరేంద్ర మోడీ గారు చేస్తున్న సేవలను కొనియాడడం జరిగింది. ఆ తర్వాత వారి స్వగ్రామమైన ధర్మసాగరంలో జయలతమ్మ మహిళా అభివృద్ధి కేంద్రంలో జెండాను ఆవిష్కరించి తర్వాత స్థానిక పాఠశాల ఆవరణలో మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో చేవెళ్ల భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు దేవర పాండురంగారెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి అనంత రెడ్డి గారు చేగూరి మల్లా రెడ్డి గారు ధర్మసాగరం సర్పంచ్ పద్మమ్మ గారు ఉప సర్పంచ్ రాజిరెడ్డి గారు పరిగి నియోజక వర్గ బిజెపి నాయకులు శరత్ కుమార్ రెడ్డి గారు , సీనియర్ నాయకులు భీమేందర్ రెడ్డి గారు, వెంకటరామిరెడ్డి గారు , లక్ష్మణ్ గారు, మరియు BJP , BJYM,ABVP నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు