సూర్యాపేట ఆగస్ట్15 :శ్రీరామరక్ష సోషల్ సర్వీసెస్ తెలంగాణ ఆధ్వర్యంలో మంగళవారం స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక శ్రీరామరక్ష కార్యాలయం నందు జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాన్ని వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ముడుంబై రఘువరన్ ఆచార్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా జాతీయ పతాకాన్ని గౌరవ సలహాదారులు రెంటాల సతీష్ శర్మ ఆవిష్కరించి తదుపరి అందరు జాతీయగీతం అలాపన చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు డాక్టర్ రఘువరన్ ఆచార్యులు మాట్లాడుతూ స్వాతంత్ర సమరంలో పోరాడి వీరమరణం పొంది నేడు స్వేచ్ఛ స్వతంత్రమైన భారతదేశాన్ని మనకు అందించిన మహానుభావులు అందరికీ జోహార్లు తెలియజేశారు. శ్రీరామరక్ష సంస్థ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా గణతంత్రం మరియు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించుకుంటూ బ్రాహ్మణ బంధువుల సహాయ సహకారాలతో ధార్మిక ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మరిన్గంటి శ్రీనివాసచార్యులు, చిలకమర్రి శ్రీనివాసచార్యులు , రెంటాల సతీష్ శర్మ , మరిన్గంటి వరద ఆచార్యులు, గర్నే పూడి శ్రీరామ శర్మ, యన్.సి.హెచ్.రోజదేవి, వలివెటీ వీరభద్ర శర్మ, గోమటం రాఘవాచార్యులు భట్టారం వంశీ కృష్ణశర్మ చొడవరపు రమణశర్మ, కృష్ణమా చార్యులు, రాణి, నాతి అంజయ్య ముడుంభై విష్ణు, సహస్ర తదితరులు పాల్గొన్నారు.