*లంక పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలి..*
— అఖిల భారత రైతుకూలీ సంఘం ఆధ్వర్యంలో..
_లంక పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చి,అడంగల్లో తమ పేర్లు నమోదు చేయాలని కోరుతూ అఖిల భారత రైతుకూలీ సంఘం (ఏఐకెఎంఎస్) ఆధ్వర్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రమైన ఆలమూరు మండల పరిషత్,తాసిల్దార్ కార్యాలయ వద్ద సోమవారం ధర్నా ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం. దుర్గాప్రసాద్,జిల్లా అధ్యక్షుడు జనిపల్లి సత్తిబాబు మాట్లాడుతూ ఎన్నో పోరాటాలు చేసి బడుగువానిలంక,మడికి గ్రామాలలో పట్టాలు సాధించుకున్నామన్నారు. 22 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూములకు అడంగల్లో పేరు నమోదు చేసి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. భూమి అడంగల్ లో వేరొకరి పేరు ఉండడంతో మాకు చాలా అన్యాయం జరుగుతుందని, ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా,రుణమాఫీ, పంట నష్టం వంటి పథకాలు అందరం లేదని, ఎన్నిసార్లు వినతి పత్రాలు అధికారులకు సమర్పించినప్పటికీ ఫలితం లేదన్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇచ్చి వారి పేర్లు అడంగల్లో నమోదు చేయాలని డిమాండ్ చేశారు.అనంతరం మండల పరిషత్ లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో వినతి పత్రాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ సభ్యులు ఉండ్రాజువరకు చిన్న, ఉండ్రాజువరపు అబ్బులు, తూలూరి ప్రేమానందం,పలువురు రైతు కూలీ సంఘం నాయకులు,మహిళా రైతులు పాల్గొన్నారు._