పాకాల ఆర్టీసీ బస్టాండ్ సి.సి.రోడ్డు ప్లాట్ ఫామ్ ను ప్రారంభించిన చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి

బస్టాండ్ సమస్యను పాకాల జడ్పిటిసి నంగా పద్మజా రెడ్డి చంద్రగిరి ఎమ్మెల్యేకి విన్నవించుకోవడంతో వారి చొరవతో నలబై సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న సమస్య పరిష్కారం……
పాకాల (స్టూడియో 10 న్యూస్ )

తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం స్థానిక పాకాల ఆర్టీసీ బస్టాండ్ సి.సి రోడ్డు ప్లాట్ ఫామ్ ను చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చేతులు మీదుగా సోమవారం పాకాల జడ్పిటిసి నంగా పద్మజా రెడ్డి,రాష్ట్ర వైఎస్ఆర్ సీపీ సేవాదళ్ కార్యదర్శి నంగా బాబురెడ్డి,పాకాల సర్పంచ్ కస్తూరి,ఎంపీటీసీల,స్థానిక వైఎస్ఆర్ సీపీ నాయకుల సమక్షంలో ప్రారంభించారు.ముందుగా దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.గత నలబై సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న పాకాల ఆర్టీసీ బస్టాండ్ సమస్యను చంద్రగిరి ఎమ్మెల్యే హయాంలో పరిష్కరించడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అని నంగా పద్మజా రెడ్డి అన్నారు.అనంతరం వైఎస్ఆర్ సీపీ నాయకులు,మహిళా నేతలు సాగర స్వాగతం పలికి శ్యాలువాతో సన్మానించారు.ఈ సందర్భంగా వైఎస్ఆర్ సీపీ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మాట్లాడుతూపాకాల బస్టాండ్ సి.సి రోడ్డు నిర్మాణానికి ముప్పైఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగిందని తెలిపారు.బస్టాండ్ సమస్యను పాకాల జడ్పిటిసి నంగా పద్మజా రెడ్డి చంద్రగిరి ఎమ్మెల్యేకి విన్నావించుకోవడంతో వారి చొరవతో నలబై సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న సమస్య పరిష్కారం అయిందన్నారు.పాకాల మండలం అభివృద్ధి కోసం చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇరవైఐదు కోట్లు ఖర్చు పెట్టడం జరిగిందని తెలిపారు.ఇంకా మండల అభివృద్ధి కోసం మావంతు సహాయ సహకారాలు అందిస్తామని,ప్రజలకు ఏ సమస్య వచ్చినా ముందుండి పరిష్కరించే దిశగా ఉంటానని తెలిపారు.రాబోయే ఎన్నికల్లో జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించి,చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ఆశీర్వదించాలని పేర్కొన్నారు.పాకాల ఆర్టీసీ కంట్రోలర్ రవికుమార్,సిబ్బంది కలిసి చంద్రగిరి ఎమ్మెల్యే తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఆలయ చైర్మన్ మహాసముద్రం పట్టాభిరెడ్డి,మాజీ చైర్మన్ మునిరత్నం రెడ్డి,వైఎస్ఆర్ సీపీ నాయకులు తలారి బాలశంకర్,ఈశ్వర్ రెడ్డి,రాజారెడ్డి,విశ్వనాథరెడ్డి,నరసారెడ్డి,మధుసూదన్ రెడ్డి,రుకేశ్ రెడ్డి,సోమశేఖర్ రెడ్డి,లింగయ్య నాయుడు,ఎ.ఎం.సి చైర్మన్ మునీర్,వైఎస్ఆర్ సీపీ నేండ్రగుంట డివిజన్ అధ్యక్షుడు గుండ్లూరు సురేష్,ఎంపీటీసీలు గౌతమి వినాయక,కస్తూరి,సర్పంచులు బాబు రెడ్డి,రాజు,కళావతి సునీత,లక్ష్మీ సుధ,కార్యకర్తలు,పంచాయతీ సిబంది,కార్మికులు,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!