మానసిక వికలాంగులపై మానవత్వాన్ని చూపండి: వైఎస్ఆర్ సిపి నాయకులు యస్ యస్ కోటి యాదవ్
తిరుపతి జిల్లా ( స్టూడియో టెన్ న్యూస్) రామచంద్రాపురం
మానసిక వికలాంగులపై మానవత్వాన్ని చూపి ఆదరించాలని వైఎస్ఆర్ సిపి నాయకులు యస్ యస్ కోటి యాదవ్ ఆదివారం మండలం లోని అక్షయక్షేత్రంలో కోటి యాదవ్ కుమారుడు యశ్విన్ 4 వ సంవత్సరం పుట్టినరోజు వేడుకలు మానసిక వికలాంగుల బంధువులు నడుమ భారీ కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు ఈసందర్భంగా కోటి మాట్లాడుతూ మా భార్య రమ్యశ్రీ మా అన్నయ్య వెంకటముని కుమార్తె మేధశ్రీతో కలిసి మా కుమారుడు యశ్విన్ పుట్టిన రోజులు వేడుకలు మానసిక వికలాంగులతో కలిసి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఇకనుంచి ప్రతి యేటా మానసిక వికలాంగులు, వృద్ధులు, తల్లిదండ్రులు లేని పిల్లలు, వృద్ధాశ్రమంలో పుట్టిన రోజులు వేడుకలు జరుపుకుంటామన్నారు ఉడతాభక్తిగా అల్పాహారం, వారికి కావలసిన ముడిసరుకులు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు ఈ వేడుకలోమధు,గురవయ్య, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు