రైతుల సమస్యలపై నేడు బీజేపీ ధర్నా

గద్వాల:- నేడు బిజెపి కిసాన్ మోర్చా జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు పాల్వాయి రాముడు ఆధ్వర్యంలో ధర్నా చేసి అనంతరం మెమోరాండం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు విచ్చేసి S. రామచంద్ర రెడ్డి మాట్లడుతూ…ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి 2018 ఎన్నికల మేనిఫెస్టోలో లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా అని రైతులతో గంప గుత్తగా ఓట్లు వేయించుకోవడం జరిగిందని కానీ తీరా చూస్తే కేవలం 25 వేల రూపాయల వరకు మాత్రమే మాఫీ చేయడం జరిగింది మరి లక్ష రూపాయలు లోన్ తీసుకున్న రైతుల పరిస్థితి ఏందని అన్నారు, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ రైతుల కోసం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో అమలవుతున్నప్పటికీ మన ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో అమలు చేసే పరిస్థితిలో లేడు, ఒకవేళ ఫసల్ బీమా యోజన మన రాష్ట్రానికి వచ్చి ఉంటే లక్షలాది మంది రైతులు అకాల వర్షాలతో, వర్షాలు లేక పంట ఎండినచో 💥💥💥 పెట్టిన పెట్టుబడి పూర్తిగా ప్రధానమంత్రి ఫసల్ భీమా ద్వారా వచ్చేదని అన్నారు, దీనితోపాటు 2014 నుంచి ఇప్పటివరకు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం లేదు💥💥💥, ఇన్పుట్ సబ్సిడీ గనుక ఇచ్చినట్లయితే , డ్రిప్పు కు 90 శాతం , స్పిన్క్లర్లకు 90 శాతం సబ్సిడీ వచ్చేదన్నారు , అదేవిధంగా వ్యవసాయ పనిముట్లు కూడా రాయితీ ద్వారా వచ్చేదన్నారు, జింకు ,జిప్సం మొదలైన ఎరువులు కూడా సబ్సిడీ ద్వారా రైతులకు వచ్చేవి అన్నారు , కానీ కెసిఆర్ కేవలం రైతుబంధు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నాడన్నారు , రైతులకు పండించిన పంటకు బోనస్ ధర ఇచ్చే పరిస్థితి లేదన్నారు, 2018 ఎన్నికల ముందు రైతులు వాడే మొత్తం ఎరువులు ఉచితంగా ఇస్తానని💥💥💥 కనీసం ఇంతవరకు ఒక బస్తా ఎరువు ఉచితంగా ఇవ్వలేదని అన్నారు, మా కేంద్ర ప్రభుత్వ విషయానికి వస్తే ఏటా రైతన్నల కోసం 2 లక్షల 18 వేల కోట్లు ఎరువులకు సబ్సిడీకి ఇస్తున్నారు🚩🚩🚩 అని అన్నారు , చిన్న రైతులందరికీ 6000/- రూపాయలు ప్రధానమంత్రి కిసాన్ సన్మానిధి🚩🚩🚩 కింద జమ చేస్తున్నారు అని అన్నారు, అదేవిధంగా అన్ని పంటల మద్దతు ధర🚩🚩🚩 కూడా దాదాపు రెట్టింపు అయ్యావి అని అన్నారు కావున వెంటనే సీఎం కేసీఆర్ గారు పైన తెలిపిన ఇచ్చిన హామీలన్నీ వెంటనే నెరవేర్చాలని జిల్లా అధ్యక్షులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు… జిల్లా యువ మోర్చా ప్రధాన కార్యదర్శి గో సాయి హరి, మల్దకల్ మండల బిజెపి అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, తిరుపతి, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు, శ్రీపాదరెడ్డి, ఉపాధ్యక్షులు RK కుశ, ఎంపీటీసీ శంకర్ నాయక్, కాజ మైనుద్దీన్, మహబూబ్, బుచ్చన్న, సూర్యకాంత్ రెడ్డి, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు…..

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!