ఎంఎస్పీ షాద్ నగర్ నియోజక వర్గ ఇంచార్జీ చిన్నోళ్ల అనంతయ్య మాదిగ
షాద్ నగర్, : ఈ నెల 20న జరిగే రంగారెడ్డి జిల్లా సన్నాహక సభను విజయవంతం చేయాలని ఎంఎస్పీ షాద్ నగర్ నియోజక వర్గ ఇంచార్జీ చిన్నోళ్ల అనంతయ్య మాదిగ ఆన్నారు. వచ్చే నెల ఆగస్టు లో చలో హైదరాబాద్, విశ్వరూప మహాసభను విజయవంతం చేయడానికి అందులో భాగంగా ఈ నెల 20న రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజక వర్గంలో “జిల్లా సన్నాహక సభ” ను విజయవంతం చేయాలని పిలుపునిచారు. ఈ సభకు ముఖ్య అతిథిగా ఎమ్మార్పీఎస్, ఎమ్మేస్పి వ్యవస్థాపకులు “మందకృష్ణ మాదిగ” హాజరవుతారని వివారించారు. మహాసభ”ను విజయవంతం చేయుటలో భాగంగా ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టీ చట్టబద్దత కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి అయినా వర్గీకరణను సాధించుకునేందుకు ఈ “సన్నాహక సభ”ను విజయవంతం చేయాలని తెలిపారు. ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా కన్వీనర్ పెంటనోళ్ళ నర్సింలు మాదిగ, చెన్నగళ్ళ శ్రావణ్ కుమార్ మాదిగ, ఎమ్మార్పీఎస్ నందిగామ మండల మాజీ ఇంఛార్జి చెన్నగళ్ళ అశోక్ మాదిగ, ఎమ్మార్పీఎస్ కొందుర్గు మండల మాజీ ఇంఛార్జి ఆనగళ్ళ ఆనంద్ మాదిగ, ఎమ్మార్పీఎస్ ఫరూఖ్ నగర్ మండల నాయకుడు నాగరికుంట మహేందర్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.