- ప్రతి సంవత్సరం ఆషాడమాసంలో జరుపుకునే సంస్కృతి, సంప్రదాయాలకు, నిలువెత్తు నిదర్శనం బోనాల పండుగ…
- ప్రతి ఏటా తెలంగాణలో ఈ పండుగను ఘనంగా నిర్వహిస్తారు…
- వర్షాకాలంలో వచ్చే రోగాల నుంచి ప్రజలను పిల్లాపాపలను, పాడిపంటలను, కాపాడాలని శక్తి స్వరూ పాలు అయినటువంటి, గ్రామ దేవతలను వేడుకుని నైవేద్యం సమర్పించే కార్యక్రమమే బోనం…
💥 పాఠశాల ప్రిన్సిపల్ యు.మహేందర్
ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీలో అక్షర ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ‘బోనాలు’ పండుగను ధార్మికతతో ఘనంగా జరుపుకున్నారు.
పాఠశాలను మామిడి, వేప ఆకులతో అలంకరించి పండుగ వాతావరణం నెలకొంది. ప్రముఖ జానపద గీతాలు, తీన్ మార్ బీట్ సంగీతానికి అనుగుణంగా విద్యార్థులు ‘పోతరాజుల’ పాత్రలు ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
అంతకుముందు,
💫ఈ వేడుకలను పాఠశాల ప్రిన్సిపల్ మహేందర్ అమ్మవారికి పూజలు చేసి,అమ్మవారికి బోనం సమర్పించి ప్రారంభించారు.
👉ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ…
తెలంగాణ రాష్ట్రంలో ఆషాడం మాసంలో జరిగే బోనాల పండుగ ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరిస్తూ…. ప్రజలు బోనాల పండుగలో పాల్గొని మొక్కులు తీర్చుకుని కృతజ్ఞతగా అమ్మవారిని వేడుకుంటారని వారు తెలిపారు.ఈ సందర్భంగా విద్యార్థిని, విద్యార్థులు సాంప్రదాయ దుస్తులను ధరించి బోనం కుండను మోస్తూ తెలంగాణ జానపద నృత్యాలను ప్రదర్శిస్తూ వివిధ రూపాలతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి తమ ప్రతిభను చాటుకున్నారు అందుకు ఎంతో సంతోషంగా ఉంది అని అన్నారు. విద్యార్థులు ఆచార సంప్రదాయాలు, తెలంగాణ విలువల పై అవగాహనతో ఉండాలన్నారు.ప్రతి సంవత్సరం ఆషాడమాసంలో జరుపుకునే సంస్కృతి, సంప్రదాయాలకు, నిలువెత్తు నిదర్శనం బోనాల పండుగ అని, వర్షాకాలంలో వచ్చే రోగాల నుంచి ప్రజలను పిల్లాపాపలను, పాడిపంటలను, కాపాడాలని శక్తి స్వరూ పాలు అయినటువంటి, గ్రామ దేవతలను వేడుకుని నైవేద్యం సమర్పించే కార్యక్రమమే బోనం అని తెలియజేశారు.
⚡ఈ సందర్భంగా పాఠశాల ఆవరణంలో బోనాల వేడుకలను నిర్వహించడం పై పాఠశాల హర్షం వ్యక్తం చేశారు.
అనంతరం,
💫బోనాల పండుగను పురస్కరించుకొని విద్యార్థులు, ఉపాధ్యాయులు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో హెచ్ఎం వెంకటేష్,ప్రతాప్,మాధవి PET లు పాఠశాల ఉపాధ్యాయులు మరియు వారి బృందం తదితరులు పాల్గొన్నారు…..