చేవెల్ల ప్రభుత్వ హాస్పిటల్లో ఆకస్మికంగా తనిఖీ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

అందుబాటులో లేని ప్రభుత్వ వైద్యులు అవస్థల్లో రోగులు

డిప్యూటేషన్ పై వెళ్లిన డాక్టర్లను తిరిగి చేవెల్లకు రప్పించాలని డిమాండ్

గైర్హాజరు అయినా వైద్యులపై చర్యలు తీసుకోవాలని డి సి హెచ్ ఓ ను కోరిన సున్నపు వసంతం

కాంట్రాక్టు వైద్యుడు ఒక్కడే ఓపి పేషెంట్లను చూస్తున్న తీరు

11 మంది డాక్టర్లకు ఒక్కడే కాంట్రాక్టు డాక్టర్

వైద్య విధాన పరిషత్ ఆధీనంలో ఉన్న ప్రభుత్వ కమ్యూనిటీ హాస్పిటల్లో సోమవారం నాడు కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల నియోజకవర్గం సీనియర్ నాయకుడు సున్నపు వసంతం ఆధ్వర్యంలో డిసిసి మాజీ అధ్యక్షుడు పడాల వెంకటస్వామి, చేవెళ్ల సర్పంచ్ ఆగిరెడ్డి, చేవెళ్ల సొసైటీ చైర్మన్ దేవర వెంకటరెడ్డి, పిసిసి సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ చేవెళ్ల ఎంపీటీసీ సభ్యుడు గుండాల రాములు, డిసిసి ప్రధాన కార్యదర్శి పెంటయ్య గౌడ్, డిసిసి ప్రధాన కార్యదర్శి రెడ్డి శెట్టి మధుసూదన్ గుప్తా, చేవెళ్ల వార్డు మెంబర్ మల్ గారి మల్లారెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు జుకన్నగారి శ్రీకాంత్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు పాండు యాదవ్, జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు బి శ్రీనివాస్, సోషల్ మీడియా చేవెళ్ల నియోజకవర్గం కో కన్వీనర్ మాణిక్యం, మైనారిటీ జిల్లా కార్యదర్శి మహమ్మద్ హనీఫ్, న్యలట మాజీ సర్పంచ్ బాలయ్య, కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు బండారు వెంకటరెడ్డి తదితరులతో కలిసి హాస్పిటల్లో ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా హాస్పిటల్ లో 11 మంది వైద్యులకు ఒక్కడే కాంట్రాక్టు డాక్టర్ ఉండడంతో ఓపి పేషెంట్లకు అవస్థలు పడుతున్న దృశ్యాన్ని పరిశీలించారు.

వైద్యుల హాజరు పట్టికను పరిశీలించారు 11 మంది వైద్యులకు గాను ఒకరే డాక్టర్ ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగులు అవస్థలు పడుతూ వివిధ రోగాల బారిన పడే హాస్పిటల్ను సందర్శిస్తే స్పెషలిస్టులు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గర్భిణీ రోగులను చూసేనాధులే లేకపోవడంతో ఆందోళన పడ్డారు. మేల్, ఫిమేల్ వార్డులో ఒకే దగ్గర ఉంచి ఉంచడం ఏమిటని ప్రశ్నించారు. డిప్యూటేషన్ పై వేరువేరు ప్రాంతాలకు వెళ్లిన డాక్టర్లను వెంటనే రప్పించాలని డి సి హెచ్ ఓ కు సున్నపు వసంతం ఫోన్లో సూచించారు. ఫార్మసిస్ట్ సరైన టైంలో రాక రోగులకు మందులు ఇవ్వక చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చేవెళ్ల ప్రభుత్వ కమ్యూనిటీ హాస్పిటల్ వైద్యుల తీరు అగమ్య గోచరంగా ఉందని, వారం రోజుల్లో వారి పరిస్థితి మెరుగుపరకపోతే ఆందోళన పెద్ద ఎత్తున చేపట్టనున్నట్లు ఆయన వివరించారు.

చేవెళ్ల ప్రభుత్వ కమ్యూనిటీ హాస్పిటల్ హీరో అగమ్మ గోచరంగా ఉందని చేవెళ్ల ఎమ్మెల్యే పట్టించుకోకపోవడం మరింత దారుణంగా ఉందని ప్రత్యేక చేశారు 100 పడకలా హాస్పిటల్లో అప్డేట్ చేస్తామని చెప్పి ఎన్నికల హామీలు ఇచ్చి దాని ఊసే ఎత్తకుండా కాలం వెళ్లదుస్తున్నారని ఎమ్మెల్యే అక్బరుద్దీన్తీరుపై మండిపడ్డారు. 50 పడకల ఆసుపత్రిని ఎమ్మెల్యే తీరు పట్ల 30 పడకల ఆసుపత్రికి తగ్గించారని ఆవేదన వ్యక్తం చేశారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!