చిన్నపాటి గొడవలతో ఓ పోలీసు కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన గూడూరు నియోజకవర్గం వాకాడు మండలలో జరిగింది. తూపిలిపాలెంకి చెందిన పోలయ్యకు 2015లో విడవలూరు మండలానికి చెందిన త్రివేణితో వివాహం జరిగింది. ఆదివారం భార్యా భర్తల మధ్య గొడవ జరగగా.. పోలయ్య ఉరేసుకున్నాడు. ప్రస్తుతం అతను నెల్లూరులోని బాలాజీనగర్ స్టేషన్లో పనిచేస్తున్నాడు.