తల్లిదండ్రుల మరణంతో అనాథలైన ఇద్దరు చిన్నారులు
మంచిర్యాల జిల్లా : పొరుగింటి వారితో జరిగిన గొడవ ఓ కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది. ఒకరి వెంట మరొకరు అన్నట్టుగా.. ఆ గొడవతో మనస్తాపం చెందిన భార్య ఆత్మహత్య చేసుకోగా.. ఆమె మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకొస్తుండగా రోడ్డు ప్రమాదంలో భర్త మరణించాడు. తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరు చిన్నారులు అనాథలుగా మిగిలారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం ఎల్లారం గ్రామంలో జరిగింది. ఎల్లారం గ్రామానికి చెందిన రేకేందర్ మల్లికార్జున్ (31), శరణ్య (28)కు ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి కొడుకు ఓంకార్(6), కూతురు ఎవాంక (4) ఉన్నారు. మల్లికార్జున్ లారీ డ్రైవర్ కాగా శరణ్య కూలీ పనులకు వెళ్తుంటుంది. అయితే, మల్లికార్జున్ ఇంటి సమీపంలో ఉండే వావిలాల రజనీ దంపతులు శుక్రవారం తమ ఇంట్లో గొడవ పడ్డారు. ఈ క్రమంలో శరణ్య ప్రస్తావన రాగా.. కలగజేసుకున్న శరణ్య వారితో వాగ్వాదానికి దిగింది. మాటామాటా పెరగ్గా శరణ్యపై రజనీ చేయి చేసుకుంది. శ విషయం తెలుసుకున్న మల్లికార్జున్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ, గొడవ వల్ల మనస్తాపం చెందిన శరణ్య శుక్రవారం సాయంత్రం పురుగుల మందు తాగడంతో కుటుంబసభ్యులు కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పతిక్రి తరలించారు. చికిత్స పొందుతున్న శరణ్య ఆదివారం ప్రాణాలు కోల్పోయింది. దీంతో శరణ్య మృతదేహాన్ని ఆదివారం రాత్రి అంబులెన్స్‌లో ఎల్లారం తరలిస్తుండగా లక్షెట్టిపేటలోని కరీంనగర్ చౌరస్తా వద్ద మల్లికార్జున్ ఆగాడు. మల్లికార్జున్ మూత్రవిసర్జన కోసం రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు…