సిఐటియు డిమాండ్
ఫరూక్ నగర్ మండలం బూర్గుల గ్రామ పరిధిలోని బ్లైండ్ అడిటివ్స్ & కాంపౌండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో నిన్న రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో కాలిన 11 మంది కార్మికులు హైదరాబాద్ అపో డిఆర్డిఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులను సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎన్ రాజు, ఉపాధ్యక్షులు అల్వాల రవికుమార్ కార్మికుల కుటుంబాలను కలిసి పరమర్శించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కంపెనీ యాజమాన్యం కార్మికులకు కనీసం సేఫ్టీ పరికరాలు ఇవ్వకుండా పనిలో పెట్టుకోవడం అట్లాగే అగ్ని ప్రమాదాలు జరిగేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఈ సంఘటన జరిగి ఎంతమంది కార్మికులు చావు బతుకుల మధ్య ఉన్నారని, సిఐటియు ఆధ్వర్యంలో రాత్రి సంఘటన స్థలాన్ని సందర్శించడం జరిగింది. ఈ సంఘటనలో అనేక వాస్తవాలు బయటికి వచ్చాయి కంపెనీకి సంబంధించిన ఫైర్ గ్యాస్ డేట్ అయిపోయినప్పటికీ రిన్యూవల్ చేయించుకోకుండా యాజమాన్యం నిర్లక్ష్యానికి నిదర్శనమని ఇప్పటికైనా కంపెనీ యాజమాన్యం పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని లేబర్ అధికారులు వెంటనే కంపెనీని సందర్శించి పూర్తిస్థాయిలో విచారణ జరిపి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు..