*అర్హులైన వారికి టిడిఆర్ బాండ్లు ఇస్తాము – కమిషనర్ హరిత ఐఏఎస్*
*తిరుపతి*
*మాస్టర్ ప్లాన్ మార్గాల్లో భాగంగా తమ స్థలాలు ఇచ్చినటువంటి వ్యక్తులకు అర్హతలు ఉండి అన్ని డాక్యుమెంట్లు ఉన్న వారందరికీ టిడిఆర్ బాండ్లు ఇస్తామని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ తెలిపారు. తిరుపతి నగరంలో ఇప్పటికే ప్రారంభించి, ప్రజలకు ఉపయోగంలోకి వచ్చిన తొండమాను చక్రవర్తి మార్గము, అదేవిధంగా పరమాచార్య మార్గాలను టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి అక్కడి ప్రజల విజ్ఞప్తి మేరకు శనివారం పరిశీలించారు. తిరుపతి నగరాభివృద్దికి దోహదపడుతున్న మాస్టార్ ప్లాన్ రోడ్లకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ, స్థలాలు ఇచ్చిన వారికి టిడిఆర్ బాండ్లు ఇవ్వడం జరిగిందని, కొంతమందికి ఆలస్యం అవ్వడంపై క్షేత్రస్థాయిలో పరిశీలనకు తానే రావడం జరిగిందని, త్వరలోనే మిగిలిన వారికి కూడా టిడిఆర్ బాండ్లను అందిస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ తెలిపారు. కమిషనర్ వెంట అదనపు కమిషనర్ సునీత, డిప్యూటీ సిటి ప్లానర్ శ్రీనివాసులు రెడ్డి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ బాలసుబ్రమణ్యం, సర్వేయర్ దేవానంధ్, ప్లానింగ్ సెక్రటరీలు పాల్గొన్నారు.*